క్రీడాభూమి

రంజీ సెమీస్‌కు ముంబయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, డిసెంబర్ 27: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి జట్టు టైటిల్‌కు మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం ఇక్కడ ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు 30 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టును ఓడించి సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ ఒత్తిడిని అధిగమించి చక్కటి ప్రదర్శనతో 40 పరుగులకు 5 వికెట్లు కైవసం చేసుకున్న అభిషేక్ నాయర్ ముంబయి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. 232 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టుపై మంగళవారం చివరి రోజు నాయర్‌తో పాటు ఎడమచేతి వాటం స్పిన్నర్ విజయ్ గోహిల్ (5/64) నిప్పులు చెరిగారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన హైదరాబాద్ జట్టులో నైట్‌వాచ్‌మన్ బి.అనిరుధ్ (84-నాటౌట్) మినహా ఎవరూ సరిగా రాణించలేకపోయారు. మరో నైట్‌వాచ్‌మన్ సివి.మిలింద్ (29)తో పాటు టెయిలెండర్లు మహమ్మద్ సిరాజ్ (0), రవికిరణ్ (1) త్వరత్వరగా పెవిలియన్‌కు పరుగెత్తడంతో 201 పరుగులకే ఆలౌటైన హైదరాబాద్ జట్టు 30 పరుగుల తేడాతో ఓటమిపాలై క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్క్రమించింది.
సంక్షిప్తంగా స్కోర్లు
ముంబయి తొలి ఇన్నింగ్స్: 294 ఆలౌట్,
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 280 ఆలౌట్,
ముంబయి రెండో ఇన్నింగ్స్: 217 ఆలౌట్,
హైరదాబాద్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 232 పరుగులు): 201 ఆలౌట్ (టిడి.అగర్వాల్ 29, బి.అనిరుధ్ 84-నాటౌట్, బిపి.సందీప్ 25, కె.సుమంత్ 14, సివి.మిలింద్ 29, అభిషేక్ నాయర్ 5/40, విజయ్ గోహిల్ 5/64).

చిత్రం..‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ నాయర్