క్రీడాభూమి

సెరెనా చేతిలో షరపోవా చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 26: ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ చేతిలో రష్యాబ్యూటీ మరియా షరపోవా మరోసారి పరాజయాన్ని ఎదుర్కొంది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సెరెనా క్వార్టర్ ఫైనల్స్‌లో షరపోవాను 6-4, 6-1 తేడాతో చిత్తుచేసింది. సెరెనాకు షరపోవాపై ఇది వరుసగా 18వ విజయం కావడం గమనార్హం. కెరీర్‌లో ఇప్పటి వరకూ 21 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకొన్న ఆమె ఈసారి కూడా ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతగా నిలిస్తే, అత్యధిక టైటిళ్లను సాధించిన జాబితాలో స్ట్ఫె గ్రాఫ్ సరనస స్థానం సంపాదిస్తుంది. మంగళవారం నాటి క్వార్టర్ ఫైనల్‌లో ఆరంభం నుంచి చివరి వరకూ సెరెనా విజృంభణ కొనసాగితే, షరపోవా గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. మొదటి సెట్‌లో కొంత మేరకు పోరాడిన ఆమె రెండో సెట్‌లో చేతులెత్తేసింది.కెరీర్‌లో ఐదు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకున్న ఈ రష్యాబ్యూటీ చివరిసారి సెరెనాపై 2004 వింబుల్డన్ ఫైనల్‌లో గెలిచింది. ఆతర్వాత నుంచి షరపోవా వెనుకంజ ఆరంభమైంది. 2005 ఆస్ట్రేలియా ఓపెన్ సెమీ ఫైనల్ నుంచి తాజా క్వార్టర్ ఫైనల్ వరకూ సెరెనాతో ఢీకొన్న ప్రతిసారీ షరపోవా పరాజయాలనే చవిచూసింది.
రద్వాన్‌స్కాతో సెమీస్ పోరు
ఇలావుంటే టైటిల్ నిలబెట్టుకునే దిశగా దూసుకెళుతున్న సెరెనా సెమీ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కాతో తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్‌లో రద్వాన్‌స్కా 6-1, 6-3 ఆధిక్యంతో పదోసీడ్ కార్లా సౌరెజ్ నవరోను చిత్తుచేసి సెమీస్‌లోకి అడు గు పెట్టింది.

ఆస్ట్రేలియా ఓపెన్
గ్రాండ్ శ్లామ్ టెన్నిస్

మరియా షరపోవాను ఓడించి సెమీ ఫైనల్స్ చేరిన సెరెనా.