క్రీడాభూమి

ఆనంద్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీబ్రాల్టర్, జనవరి 27: ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఇక్కడ ఆరంభమైన జీబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్ మాస్టర్స్ విభాగం తొలి రౌండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. 23 సంవత్సరాల తర్వాత మొదటిసా ఒక ఓపెన్ ఈవెంట్‌లో పాల్గొంటున్న అతను హంగెరీకి చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ జిడొనియా లజార్నే చేతిలో ఓటమిపాలయ్యాడు. ప్రత్యర్థి ఎత్తుగడలను అర్థం చేసుకోవడంలో విఫలమైన ఆనంద్ పావులను తన బలగాలను సక్రమంగా నడిపించలేకపోయాడు. అందుకు మూల్యాన్ని చెల్లించుకున్నాడు.
అండర్-19 ప్రపంచ కప్
బంగ్లాదేశ్ బోణీ
చిట్టగాంగ్, జనవరి 27: అండర్-19 ప్రపంచ క ప్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న బం గ్లాదేశ్ శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగి న మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో విజయం సా ధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 240 పరుగులు సాధించిం ది. పినాక్ ఘోష్ 43, జాయ్‌రాజ్ షేక్ 46, నజ్ముల్ హొసేన్ షాంటో 73 చొప్పున పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు వియాన్ వౌల్టర్ 42 పరుగు లకు మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 48.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. లియామ్ స్మిత్ 100 పరు గులు చేసినా, జట్టులోని మిగతా వారు విఫలమై దక్షిణాఫ్రికా పరాజయానికి కారణమయ్యారు.్ప్ప
బహుమతి ఆశపెట్టి
మాట మార్చిన పిసిబి
లాహోర్, జనవరి 27: మాట మార్చడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి కొత్తకాదు. విదేశీ క్రికెట్ బోర్డులతోనేకాదు, స్థానిక క్రికెటర్ల విషయంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తున్నది. జాతీయ వనే్డ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో 19 ఏళ్ల యువ పేసర్ జియా ఉల్ హక్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అతని ప్రతిభతో జాతీయ బ్యాంక్ జట్టు విజయభేరి మోగించి ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్‌ని తిలకించిన పిసిబి అధికారులు జియాను ఆకాశానికి ఎత్తేశారు. అంతటితో ఆగకుండా 50,000 నగదు నజరానా ప్రకటించారు. ఇచ్చింది మాటే కాబట్టి తొందరగా మార్చేయవచ్చన్న ధీమాతో తాము ప్రకటించిన మొత్తం ఫైనల్ మ్యాచ్‌లో ప్రతిభ కనబరచిన వారికే దక్కుతుందని ప్రకటించారు. సెమీ ఫైనల్స్‌లో ప్రత్యేకంగా నగదు బహుమతులు ఉండవని, ఫైనల్‌కు మాత్రమే తమ నిర్ణయం వర్తిస్తుందని ప్రకటించి జియాను నిరుత్సాహపరిచారు. సెమీస్‌లో ఐదు వికెట్లు తీసిన వెంటనే యాభై వేలు ఇస్తున్నట్టు ప్రకటించిన అధికారులు ఎందుకు మాట మార్చారో అర్థంగాక తెల్లముఖం వేయడం జియా వంతైంది. పిసిబి మాటలు నమ్మి మోసపోయానంటూ ఆ కుర్ర పేసర్ వాపోతున్నాడు.