క్రీడాభూమి

రామచంద్రన్‌పై విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఒఎ అధ్యక్షుడు రామచంద్రన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుంభకోణాల్లో అతనికి ఎలాంటి పాత్ర లేకపోయినప్పటికీ, సురేష్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం వెనుక అతని మాస్టర్ ప్లాన్ బలంగా పని చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దోషులుగా కోర్టు ప్రాథమికంగా నిర్ధారించిన వారిని ఏ విధంగా ఎంపిక చేస్తారంటూ రామచంద్రన్‌పై పలువురు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పరులకు మద్దతనివ్వడం కూడా అవినీతిని ప్రోత్సహించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. రామచంద్రన్‌ను సైతం కల్మాడీ, చౌతాలా మాదిరిగా దోషిగానే మిగిలిపోతాడన్నారు.

చిత్రం..కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్