క్రీడాభూమి

నీల్ బ్రూమ్ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీల్సన్, డిసెంబర్ 29: యువ బ్యాట్స్‌మన్ నీల్ బ్రూమ్ అజేయ శతకంతో రాణించగా, గురువారం పాకిస్తాన్‌తో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను 67 పరుగుల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో బ్రూమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొదటి వనే్డను సాధించిన ఉత్సాహంతో రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగి, మొట్టమొదటి ఓవర్‌లోనే మార్టిన్ గుప్టిల్ (0) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్ (11), ఓపెనర్ టామ్ లాథమ్ (22) తక్కువ పరుగులకే అవుట్‌కాగా, బ్రూమ్ క్రీజ్‌లో నిలదొక్కుకొని స్కోరు బోర్డును ముందుకు దూకించాడు. జిమీ నీషమ్ (28), ల్యూక్ రోన్చీ (35) నుంచి లభించిన అతి కొద్దిపాటి సహకారాన్ని ఉపయోగించి, కెరీర్‌లో మొదటి వనే్డ సెంచరీ సాధించాడు. 107 బంతులు ఎదుర్కొని, 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 109 పరుగులు చేసిన అతను చివరి వరకూ నాటౌట్‌గా నిలవగా, చివరి బంతికి ట్రెంట్ బౌల్ట్ (12) రనౌట్ కావడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 251 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఇమ్రుల్ ఖయాస్ (59), సబ్బీర్ రహ్మాన్ (38), నూరుల్ హసన్ (24) తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు అందించలేకపోయారు. ఫలితంగా ఇంకా 44 బంతులు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ 184 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్‌సన్ 3 వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ చెరి 2 వికెట్లు కూల్చారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 251 ఆలౌట్ (నీల్ బ్రూమ్ 109 నాటౌట్, జిమీ నీషమ్ 28, ల్యూక్ రోన్చీ 35, మష్రాఫ్ మొర్తాజా 3/49, టస్కిన్ అహ్మద్ 2/45, షకీబ్ అల్ హసన్ 2/34).
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 42.4 ఓవర్లలో 184 ఆలౌట్ (ఇమ్రుల్ ఖయాస్ 59, సబ్బీర్ రహ్మాన్ 38, నూరుల్ హసన్ 24, కేన్ విలియమ్‌సన్ 3/22, ట్రెంట్ బౌల్ట్ 2/26, టిమ్ సౌథీ 2/33).