క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు హీనా క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు భారత ఏస్ షూటర్ హీనా సిద్ధు క్వాలిఫై అయంది. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సంపాదించేందుకు భారత షూటర్లు చివరి ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం నుంచి ఇక్కడ ప్రారంభమైన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీల్లో రాణించిన వారు రియోకు క్వాలిఫై అవుతారు. పురుషులు, మహిళల ట్రాప్, స్కీట్ విభాగాల్లో నాలుగేసి స్థానాలు రియోకు అందుబాటులో ఉంటాయి. బుధవారం మహిళల 10 మీటర్ల ఎయర్ పిస్టల్ విభాగంలో హీనా 199.4 పాయంట్లు సంపాదించి, స్వర్ణ పతకాన్ని అందుకొని, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. చైనీస్ తైపీకి చెందిన తియెన్ చియా చెన్ 198.1 పాయంట్లతో రజత పతకాన్ని అందుకుంది. జిమ్ యున్ మీ (కొరియా)కు కాంస్య పతకం లభించింది. ఆమె 177.9 పాయంట్లు సంపాదించింది.
సూపర్ ముర్రే ముందంజ
మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో జొహన్నా కొన్టా సెమీ ఫైనల్స్ చేరితే, ఆమెతో పోటీపడుతూ పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రే కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. బ్రిటన్‌కు చెందిన వీరిద్దరూ టైటిల్ సాధించే దిశగా అడుగులు ముందుకేస్తున్నారు. అసాధారణమైన ఫామ్‌లో ఉన్న ముర్రేకు క్వార్టర్ ఫైనల్స్‌లో డేవిడ్ ఫెరర్ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీగా పోరాడిన ముర్రే 6-3, 6-7, 6-2, 6-3 ఆధిక్యంతో ఫెరర్‌ను ఓడించాడు. మరో క్వార్టర్ ఫైనల్‌లో మిలోస్ రవోనిక్ 6-3, 3-6, 6-3, 6-4 స్కోరుతో గేల్ మోన్ఫిల్స్‌పై విజయం సాధించాడు. ముర్రే మాదిరిగానే రవోనిక్ కూడా మ్యాచ్‌ని నాలుగు సెట్లలో గెలిచాడు.
ఫైనల్‌లో స్థానం కోసం ముర్రే, రవోనిక్ మధ్య పోరాటం సాగుతుంది. అదే విధంగా మరో సెమీ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్ ఢీ కొంటారు.