క్రీడాభూమి

పరిస్థితిని సమీక్షిస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: భారత్‌లో జాతీయ ఒలింపిక్ సంఘం (ఎన్‌ఒసి)పై సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) మీడియా రిలేషన్స్ మేనేజర్ మైఖేల్ నోయెల్ తెలిపాడు. దేశానికి ఎన్‌ఒసిగా ఉన్న ఐఒఎ గుర్తింపును రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో, గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఐఒఎ అధ్యక్షుడు రామచంద్రన్ న్యూజిలాండ్‌లో ఉన్నందున, కేంద్ర జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చే అవకాశమే లేకుండా పోయింది. అతను కూడా ఎలాంటి మార్గదర్శకాలను సూచించకపోవడంతో తీవ్రంగా స్పందించిన కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కల్మాడీ, చౌతాలలను జీవితకాల ఉపాధ్యక్షులుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించింది. కాగా, ఈ పరిణామాలపై తనను సంపద్రించిన పిటిఐతో నోయెల్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ, ఇప్పుడు ఐఒసి కార్యాలయానికి సెలవులని చెప్పాడు. తిరిగి తెరిచిన తర్వాత, భారత్‌లో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తామని పేర్కొన్నాడు. అన్ని విషయాలను చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణను ఐఒసి ఖరారు చేస్తందని తెలిపాడు.