క్రీడాభూమి

పంచాల్ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, జనవరి 1: జార్ఖండ్‌తో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మొదటి రోజు ఆటలో ప్రియాంక్ కిరీట్ పంచాల్ అజేయ శతకంతో రాణించడంతో గుజరాత్ ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 283 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 62 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్‌కను సమిత్ గొహెల్ (18) రూపంలో కోల్పోయింది. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన భార్గవ్ మెరాయ్ 66 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లతో 39 పరుగులు చేసి వికాస్ సింగ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్, వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ క్రీజ్‌లో నిలదొక్కుకొని గుజరాత్ స్కోరుబోర్డును ముందుకు దూకించాడు. అతను 115 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి, కౌశల్ సింగ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మన్‌ప్రీత్ జునేజా (12 నాటౌట్)తో కలిసి మొదటి రోజు ఆటను ముగించిన పంచాల్ 252 బంతులు ఎదుర్కొని, 144 పరుగులు చేశాడు. ఈ స్కోరులో 21 ఫోర్లు ఉన్నాయి.
రికార్డు పుస్తకాల్లో చోటు: పంచాల్‌కు రంజీ ట్రోఫీ రికార్డు పుస్తాకాల్లో చోటు దక్కింది. 2015-16 సీజన్‌లో 665 పరుగులు సాధించిన అతను ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 1,264 పరుగులు చేశాడు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న వసీం జాఫర్‌ను 19 ఏళ్ల పంచాల్ ఐదో స్థానానికి నెట్టేశాడు. వివిఎస్ లక్ష్మణ్ (1,415 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (1,321 పరుగులు), విజయ్ భరద్వాజ్ (1,280) మాత్రమే ఒక సీజన్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో పంచాల్ కంటే ముందున్నారు. ఇంకా క్రీజ్‌లోనే ఉన్న అతను మ్యాచ్ రెండో రోజు, సోమవారం ఉదయం ఆటను కొనసాగించి, డబుల్ లేదా ట్రిపుల్ సెంచరీ చేయగలిగితే, విజయ్ లేదా శ్రేయాస్‌లకు స్థానభ్రంశం తప్పదు.
తమిళనాడు 6/261
రాజ్‌కోట్: రాజ్‌కోట్‌లో ముంబయితో తలపడుతున్న తమిళనాడు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 261 పరుగులు చేసింది. కౌశిక్ గాంధీ (50), బాబా ఇంద్రజిత్ (64) అర్ధ శతకాలతో రాణించగా, విజయ్ శంకర్ 41 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ముంబయి బౌలర్లు శార్దూల్ ఠాకూర్ 64 పరుగులకు రెండు, అభిషేక్ నాయర్ 56 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టాడు.

చిత్రం..ప్రియాంక్ కిరీట్ పంచాల్