క్రీడాభూమి

సింధుకి ఇంటి స్థలం కేటాయంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో సింధు రజత పతకాన్ని సాధించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు అనేక బహుమతులను అందించిన విషయం విదితమే. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇంటి కోసం వెయ్యి చదరపు అడుగుల భూమిని కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ మేరకు షేక్‌పేట్ గ్రామపరిధి తొమ్మిదోవార్డులోని భరణిలే అవుట్‌లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం గల భూమిని కేటాయిస్తూ మున్సిపల్ వ్యవహారాల స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.జి. గోపాల్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.