క్రీడాభూమి

చెన్నై ఓపెన్‌లో బాంబ్రీ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 3: చాలా రోజుల తర్వాత మళ్లీ టెన్నిస్ బరిలోకి దిగిన భారత డేవిస్ కప్ జట్టు యువ ఆటగాడు యూకీ బాంబ్రీ తన పునరాగమనాన్ని ఘనంగా ప్రారంభించాడు. ఇక్కడ జరుగుతున్న చెన్నై ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో మంగళవారం అతను వరుస సెట్ల తేడాతో స్థానిక ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్‌ను మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ పోరులో బాంబ్రీ 6-1, 6-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. టెన్నిస్ ఎల్బో (మణికట్టు) గాయం వలన ఇబ్బందులు ఎదురవడంతో గత సీజన్‌లో దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరమైన బాంబ్రీ ఈ విజయంతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. రెండో రౌండ్‌లో అతను ఈ టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన బెనోయిట్ పైర్ తలపడనున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 47వ స్థానంలో కొనసాగుతున్న పైర్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 6-3, 6-4 సెట్ల తేడాతో రష్యాకు చెందిన కొన్‌స్టాంటిన్ క్రవ్‌చుక్‌పై విజయం సాధించాడు. అలాగే మంగళవారం జరిగిన ఇతర మ్యాచ్‌లలో చైనీస్ తైపీకి చెందిన ఎనిమిదో సీడ్ ఆటగాడు యెన్ హ్యున్ లు 6-2, 6-1 తేడాతో మ్లదోవాకు చెందిన రడు అబ్లోట్‌ను చిత్తు చేయగా, బ్రిటన్‌కు చెందిన అల్జాజ్ బెడెన్ 6-3, 6-3 తేడాతో గులెర్మో గార్సికా లోపెజ్ (రష్యా)పై, అర్జెంటీనా ఆటగాడు రెంజో ఒలీవో 7-6(3), 6-2 తేడాతో కాస్పర్ రడ్ (నార్వే)పై విజయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించారు.

చిత్రం.. యూకీ బాంబ్రీ