క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఫైనల్‌కు సాంటినా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 27: స్విట్జర్లాండ్‌కు చెందిన మాజీ ప్రపంచ నంబర్ వన్ మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో వీరవిహారం చేస్తున్న భారత టెన్నిస్ బ్యూటీ, హైదరాబాదీ సానియా మీర్జా ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌లో స్థానం సంపాదించింది. ‘సాంటినా’గా పేరొందిన ఈ జోడీ బుధవారం నాటి సెమీ ఫైనల్‌లో జూలియా జార్జెస్, కరోలినా ప్లిస్కోవా జోడీని 6-1, 6-0 తేడాతో చిత్తుచేసింది. సానియా, మార్టినా విజృంభణకు ప్రత్యర్థుల నుంచి ఎలాంటి సమాధానం లేకపోయింది. వరుసగా 35వ విజయాన్ని నమోదు చేసిన సాంటినా జోడీ ఫైనల్‌లో ఆండ్రియా హ్లవకొవా, లూసీ హ్రాడెక్ జోడీతో తలపడుతుంది. మరో సెమీ ఫైనల్‌లో హ్లవకొవా, హ్రాడెక్ 3-6, 6-3, 6-1 తేడాతో జూ ఇఫాన్, జాంగ్ సయ్‌సయ్ జోడీపై గెలుపొందింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బొపన్న పోరాటానికి తెరపడింది. చైనీస్ తైపీకి చెందిన యంగ్ జాన్ చాన్‌తో కలిసి ఆడుతున్న అతను క్వార్టర్ ఫైనల్స్‌లో 2-6, 5-7 తేడాతో అండ్రెజా క్లెపాక్, ట్రీట్ హే జోడీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.
chitram..
మార్టినా హింగిస్, సానియా మీర్జా