క్రీడాభూమి

సెలక్షన్ కమిటీకి ‘సుప్రీం’ కత్తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తేల్చిచెప్పడంతో జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ పరిమాణం తగ్గనుంది. లోధా కమిటీ నిర్ధేశించిన నిబంధనల మేరకు గగన్ ఖోడా, జతిన్ పరాంజపే సెలక్షన్ కమిటీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. లోధా కమిటీ సూచించిన సంస్కరణల ప్రకారం ముగ్గురు టెస్టు క్రికెటర్లతో సీనియర్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో బిసిసిఐ సెలక్షన్ కమిటీని ప్రకటించే నాటికి సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఉద్వాసనకు గురైన అప్పటి బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే మరోసారి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. అయితే వారు ఏర్పాటు చేసిన నూతన సెలక్షన్ కమిటీ లాంఛనంగా ఎటువంటి పనులు చేపట్టలేదు. దీంతో ఆ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్న ముగ్గురు మాజీ టెస్టు క్రికెటర్లు ఎంఎస్‌కె.ప్రసాద్, దేవాంగ్ గాంధీ, సందీప్ సింగ్ మాత్రమే ఇప్పుడు ఇంగ్లాండ్‌తో అంతర్జాతీయ వనే్డలు, ట్వంటీ-20 మ్యాచ్‌లలో తలపడే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక గురువారం జరుగుతుంది. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉండే ముగ్గురు సభ్యులకూ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆడిన అనుభవం తప్పనిసరిగా ఉండి తీరాలి. అయితే అంతర్జాతీయ కెరీర్‌లో రెండు వనే్డలు మాత్రమే ఆడిన గగన్ ఖోడాకు, అలాగే నాలుగు వనే్డలు మాత్రమే ఆడిన జతిన్ పరాంజపేకి టెస్టుల్లో ఆడిన అనుభవం లేకపోవడంతో వీరిద్దరూ సెలక్షన్ కమిటీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చిత్రాలు..గగన్ ఖోడా, జతిన్ పరాంజపే