క్రీడాభూమి

సుప్రీం తీర్పుపై సానుకూల స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: లోధా కమిటీ సిఫార్సులు సక్రమంగా అమలు జరిగేందుకు వీలుగా బిసిసిఐలో ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తామని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయానికి మద్దతు పెరుగుతున్నది. మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అంటూ, దేశంలో క్రికెట్ ఒక గాడిన పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విశ్రాంత న్యాయమూర్తుల మార్గదర్శకత్వంలో బిసిసిఐ పాలనా వ్యవహారాలు ఒక దారికొస్తాయని బేడీ అభిప్రాయం. మరో మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఇలావుంటే, సుప్రీం కోర్టు నిర్ణయానికి అనుకూలంగా ప్రకటనలు చేసిన బేడీ, ఆజాద్‌లనే ద్విసభ్య కమిటీలో సభ్యులుగా ఉంచాలని క్రికెట్‌కు సంబంధం లేని పలువురు మాజీ ఒలింపియన్లు సూచించారు. మాజీ హాకీ ఆటగాళ్లు అశోక్ కుమార్, గుర్‌బక్స్ సింగ్, బల్బీర్ సింగ్, జొక్విమ్ కర్వాలో, మాజీ అథ్లెట్లు అశ్వినీ నాచప్ప, రీత్ అబ్రహం, వందనా రావు, ఎడ్వర్డ్ సెక్వెరా, స్మిమ్మర్ నిషా మిల్లెట్, బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా తదితరులు ఒక సంయుక్త ప్రకటనలో బేడీ, ఆజాద్‌లకు సంపూర్ణ మద్దతు పలికారు. భారత క్రికెట్‌ను విశిష్ట సేవలు అందించిన వీరిద్దరూ సుప్రీం కోర్టు నియమించబోయే కమిటీలో సభ్యులుగా ఉండే మంచి ఫలితాలు వస్తాయని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు.