క్రీడాభూమి

రిటైర్మెంట్ ఆలోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 5: రిటైర్మెంట్ ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ స్పష్టం చేశాడు. ఇక్కడ జరుగుతున్న చెన్నై ఓపెన్ పురుషుల డబుల్స్‌లో అతను బ్రెజిల్ ఆటగాడు ఆండ్రె సాతో కలిసి ఆడుతున్నాడు. మొదటి రౌండ్‌లో భారత్‌కు చెందిన పురవ్ రాజా, దివిజ్ శరణ్ జోడీని ఓడించిన 43 ఏళ్ల పేస్ పిటిఐతో మాట్లాడుతూ వచ్చే ఏడాది కూడా తాను చెన్నై ఓపెన్‌లో ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. రిటైర్మెంట్ గురించి తాను ఆలోచించడం లేదని, ఈ విషయంలో తాను స్పష్టతతో ఉన్నానని చెన్నై ఓపెన్‌లో మహేష్ భూపతితో కలిసి ఐదు, జన్కో తిస్పారెవిచ్ (సెర్బియా)తో కలిసి ఒకసారి టైటిళ్లు సాధించిన పేస్ అన్నాడు. సోమ్‌దేవ్ దేవ్‌వర్మ టెన్నిస్ నుంచి రిటైరైనప్పుడు విలేఖరులు తన నిర్ణయం గురించి ఆడిగారని, ఆ సమయంలో తాను సమాధానమిస్తూ ‘నేడు లేదా రేపు లేదా ఆరు నెలల తర్వాత.. ఎప్పుడో ఒకసారి రిటైర్ కావాల్సిందేకదా’ అన్నానని వివరించాడు. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న మీడియాలో ఒక వర్గం తాను రేపోమాపో రిటైర్ అవుతున్నానని చెప్పినట్టు పేర్కొందని కెరీర్‌లో ఇంత వరకూ 18 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన పేస్ అన్నాడు. నిజానికి రిటైర్మెంట్ గురించి తాను ఏమీ ఆలోచించడం లేదని పునరుద్ఘాటించాడు. ఇకపై ఆడలేనని అనుకున్నప్పుడే రిటైర్ అవుతానని అతను తేల్చిచెప్పాడు.

చిత్రం..లియాండర్ పేస్