క్రీడాభూమి

పృథ్వీ షా సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, జనవరి 5: రంజీ ట్రోఫీ కెరీర్‌లో పృథ్వీరాజ్ తొలి సెంచరీని నమోదు చేయగా, తమిళనాడుతో జరిగిన సెమీ ఫైనల్‌ను ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న ముంబయ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేయగా, ముంబయి 411 పరుగులు సాధించి, 106 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన తమిళనాడు ఆరు వికెట్లకు 356 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచి, ఓటమిని కొనితెచ్చుకుంది. బలమైన బౌలింగ్ విభాగం ఉందన్న మితిమీరిన విశ్వాసంతో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తమిళనాడు తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. సునాయాస లక్ష్యాన్ని అందుకోవడానికి రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ముంబయి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా ఐదు పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన గురువారం ఉదయం ఆటను కొనసాగించి, 62.1 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా సెంచరీతో కదం తొక్కడంతో ముంబయికి విజయం సులభమైంది. 90 పరుగుల స్కోరువద్ద ప్రఫుల్ వాఘెలా (36) అవుట్‌కాగా, శ్రేయాస్ అయ్యర్ 40 పరుగులు సాధించి విజయ్ శంకర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 34 పరుగులు సాధించిన సూర్యకుమార్ యాదవ్‌ను అభినవ్ ముకుంద్ క్యాచ్ పట్టగా ఆషిక్ శ్రీనివాస్ అవుట్ చేశాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, 175 బంతులు ఎదుర్కొన్న పృథ్వీ 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేసి ఆషిక్ శ్రీనివాస్ బౌలింగ్‌లోనే నటరాజన్‌కు చిక్కాడు. అయితే, అప్పటికే ముంబయి విజయానికి కేవలం పది పరుగుల దూరంలో ఉంది. ఆదిత్య తారే (4), సిద్దేష్ లాడ్ (1) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ ముంబయిని ఫైనల్‌కు చేర్చారు. టైటిల్ కోసం ఇక ఈ జట్టు గుజరాత్‌ను ఢీ కొంటుంది. నాలుగు రోజు ల్లోనే ముగిసిన సెమీస్‌లో జార్ఖండ్‌ను గుజరాత్ 123 పరు గుల ఆధిక్యంతో ఓడించిన విషయం తెలిసిందే. కాగా, గు జరాత్‌పై ముంబయ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతుంది.

సంక్షిప్త స్కోర్లు
తమిళనాడు తొలి ఇన్నింగ్స్: 115.2 ఓవర్లలో 305 ఆలౌట్ (బాబా ఇందర్‌జిత్ 64, కౌశిక్ గాంధీ 50, విజయ్ శంకర్ 50, శార్దూల్ ఠాకూర్ 4/75, అభిషేక్ నాయర్ 4/66).
ముంబయి తొలి ఇన్నింగ్స్: 150.3 ఓవర్లలో 411 ఆలౌట్ (ఆదిత్య తారే 83, సూర్యకుమార్ యాదవ్ 73, అభిషేక్ నాయర్ 58, శార్దూల్ ఠాకూర్ 52, విజయ్ శంకర్ 4/59, బాబా అపరాజిత్ 2/75).
తమిళనాడు రెండో ఇన్నింగ్స్: 78 ఓవర్లలో 6 వికెట్లకు 356 డిక్లేర్డ్ (అభినవ్ ముకుంద్ 122, బాబా ఇందర్‌జిత్ 138, బల్వీందర్ సంధు 2/67, విజయ్ గోహెల్ 2/109).
ముంబయి రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 251/ ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టం లేకుండా 5 పరుగులు): 62.1 ఓవర్లలో 4 వికెట్లకు 251 (పృథ్వీ షా 120, ప్రఫుల్ వాఘెలా 36, శ్రేయాస్ అయ్యర్ 40, సూర్యకుమార్ యాదవ్ 34, ఆషిక్ శ్రీనివాస్ 2/73).

చిత్రం..సెంచరీ హీరో పృథ్వీ షా (120)