క్రీడాభూమి

నా కెప్టెన్‌వి నువ్వే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: తనకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీనే కెప్టెన్‌నని, ఈ విషయంలో తన అభిప్రాయం మారబోదని టెస్టు జట్టుతోపాటు వనే్డ, టి-20 ఫార్మాట్స్‌కు కూడా భారత సారథిగా పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ అన్నాడు. టీమిండియాకు అతని అవసరం ఎంతో ఉందని కోహ్లీ ట్వీట్ చేశాడు. ‘యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నీలాంటి వ్యక్తి మైదానంలో ఉండాలనే మేమంతా కోరుకుంటున్నాం. ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌వి. నా ఆలోచనా విధానం ఎన్నటికీ మారదు’ అన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తదితరులు కూడా ధోనీ రిటైర్మెంట్‌పై ట్వీట్ చేశారు. అతనిని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడుగా అభివర్ణించారు.
మగాళ్లని అనిపించుకునే హక్కు మీకు లేదు..
బెంగళూరు రోడ్డుపై ఒక మహిళ పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనపై కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. ఆ ప్రదేశంలోనే ఉన్నప్పటికీ, జరుగుతున్న ఘోరాన్ని కళ్లప్పగించి చూస్తూ, దానిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయని వారిపై కోహ్లీ మండిపడ్డాడు. వారందరికీ తమను తాము మగాళ్లమని అనిపించుకునే హక్కు లేదని ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన రెండు క్లిప్పింగ్స్‌లో కోహ్లీ పేర్కొన్నాడు. ‘ఇలాంటి సంఘటనే మీ ఇళ్లలో జరుగుతుంటే, ఇదే విధంగా చూస్తూ కూర్చునేవారా? బాధితురాలికి సహాయం చేయకుండా ప్రేక్షక పాత్ర పోషించేవారా’ అంటూ ఆ సంఘటన జరగినప్పుడు అక్కడే ఉన్న వ్యక్తులను ఉద్దేశిస్తూ ప్రశ్నించాడు. బాధితురాలు పొట్టి దుస్తులు ధరించింది కాబట్టే వేధింపులకు గురైందన్న వాదనను అతను తప్పుపట్టాడు. ఎవరి ఇష్టం వారిదని, ఒకరి ఇష్టాయిష్టాలను శాసించే హక్కు, అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశాడు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతున్న సమాజంలో ఉన్నందుకు తాను సిగ్గుపడుతున్నానని అన్నాడు. మన ఆలోచనా ధోరణి మారినప్పుడే మహిళలపై దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడుతుందని కోహ్లీ పేర్కొన్నాడు.