క్రీడాభూమి

అండర్-19 వరల్డ్ కప్ ఐర్లాండ్‌పై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్, జనవరి 28: అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో గురువారం ఐర్లాండ్‌ను ఢీకొన్న భారత్ 79 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ అర్ధ శతకాలతో రాణించడంతో, ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 268 పరుగుల చేయగలిగింది. సర్ఫరాజ్ 70 బంతులు ఎదుర్కొని 74, సుందర్ 71 బంతుల్లో 62 చొప్పున పరుగలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. లొక్రన్ టక్కర్ (57), విలియమ్ మెక్‌క్లింటాక్ (58) హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో రాహుల్ బథమ్ 15 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు.
న్యూజిలాండ్‌కు నేపాల్ షాక్
ఫతుల్లా: అండర్-19 ప్రపంచ కప్‌లో గురువారం న్యూజిలాండ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అనామక నేపాల్ జట్టు చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో ఆలౌటైంది.
ఇతర కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలవగా, కెనడాను శ్రీలంక 196 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది.

రాంచీ చేతిలో కళింగ ఓటమి
రాంచీ, జనవరి 28: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో గురువారం జరిగిన మ్యాచ్ లో కళింగ లాన్సర్స్ జట్టు ఓటమిపాలైంది. రాంచీ రేస్ 3-2 తేడాతో విజయం సాధించి ముందంజ వేసింది. 33వ నిమిషంలో మలాక్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో కళింగకు రెండు గోల్స్ లభించాయ. అనంతరం 39వ నిమిషంలో ఆష్లే ఫీల్డ్ గోల్ సాధించిరాంచీకి రెండు గోల్స్ అందించాడు. 48వ నిమిషంలో తిమోతీ డీవిన్ గోల్‌తో రాంచి గెలిచింది.

మిక్స్‌డ్ డబుల్స్‌లో
సెమీస్‌కు సానియా, డోడింగ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడింగ్‌తో కలిసి పోటీపడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సెమీ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో సానియా, డోడింగ్ జోడీ 7-6, 6-3 తేడాతో మార్టినా హింగిస్, లియాండర్ పేస్ జోడీని ఓడించింది. సానియాకు ఇది ఎంతో సున్నితమైన మ్యాచ్‌గా మారింది. ఒకవైపు మహిళల డబుల్స్‌లో తనకు భాగస్వామిగా ఉన్న మార్టినా హింగిస్. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో తన మాజీ పార్ట్‌నర్ లియాండర్ పేస్. ఇద్దరితోనూ ఎంతోకాలంగా సన్నిహిత సంబంధాలున్న సానియా వారిపైనే గెలిచి సెమీస్ చేరడం గమనార్హం. ఫైనల్‌లో స్థానం కోసం ఎలెనా వెస్నినా, బ్రూనో సోరెస్ జంటను సానియా, డోడింగ్ ఢీ కొంటారు. వెస్నినా, సోరెస్‌లు సానియాకు ఒకప్పుడు మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ భాగస్వాములు కావడం గమనార్హం. కాగా, మహిళల డబుల్స్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి సానియా ఇప్పటికే ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.