క్రీడాభూమి

కష్టపడితేనే విజయాలు: కరణం మల్లేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 8: నిరంతరం శ్రమించి, లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేసినప్పుడే విజయాలు సాధ్యమవుతాయని 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత మాజీ రెజ్లర్ కరణం మల్లేశ్వరి అన్నది. అన్ని స్థాయల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఖేలో ఇండియా గ్రూప్-3 రాష్టస్థ్రాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు శ్రీకాకుళంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తదితరులు పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఇక్కడి గల కోడిరామ్మూర్తి స్టేడియం దరిలోగల అంబేద్కర్ ఆడిటోరియం వేదికగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలబాలికలు పోటీపడతారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. తొలుత వివిధ జిల్లాల నుంచి వచ్చిన లిఫ్టర్లు మార్చ్ఫాస్ట్, అనంతరం ఖేలో ఇండియా పతకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగివున్న శక్తిని వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఉపకరిస్తాయన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో క్రీడాకారులు తమ సత్తాను చాటుకున్నారు.

చిత్రం..కరణం మల్లేశ్వరి