క్రీడాభూమి

సూపర్ సెరెనా ( ఫైనల్‌కు దూసుకెళ్లిన ప్రపంచ నంబర్ వన్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 28: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో విజయపరంపరలను కొనసాగిస్తూ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఆమె నాలుగో సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కాను 6-0, 6-4 తేడాతో చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ఆధిపత్యాన్ని కొనసాగించిన సెరెనా ముందు రద్వాన్‌స్కా నిలవలేకపోయింది. కెరీర్‌లో 26వ గ్రాండ్ శ్లామ్ ఫైనల్ చేరిన సెరెనా తన టైటిల్ నిలబెట్టుకోవడానికి ఏడోసీడ్ ఏంజెలిక్ కెర్బర్‌ను ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో కెర్బర్ 7-5, 6-2 స్కోరుతో బ్రిటిష్ క్రీడాకారిణి జొహన్నా కొన్టాపై విజయం సాధించింది.