క్రీడాభూమి

బిసిసిఐ కొత్త ఎత్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: క్రికెట్‌పై తన పట్టును కొనసాగించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొత్త ఎత్తులు వేస్తున్నది. అందులో భాగంగానే, మ్యాచ్‌లను నిర్వహించే స్థితిలో లేమంటూ కొన్ని సభ్య సంఘాలతో చెప్పిస్తున్నది. సుప్రీం కోర్టు ఆదేశాలతో బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనురాగ్ ఠాకూర్, ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కారణంగా పరువు కోల్పోయిన మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ ఇటీవల బెంగళూరులో జరిపిన సమావేశం ఆంతర్యం కూడా ఇదేనన్నది వాస్తవం. తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసన్ గతంలో మాదిరిగానే భారత క్రికెట్‌ను తన ఆధీనంలో ఉంచుకునేందుకు పాచికలు వేస్తున్నాడు. భారత్, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వలేమంటూ బిసిసిఐకి లేఖ రాయడం ద్వారా తన ఆంతర్యం ఏమిటో టిఎన్‌సిఎ చెప్పకనే చెప్పింది. ముందుగా ఖరారైన ప్రాంతీయ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బిసిసిఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రికి రాసిన ఒక లేఖలో పేర్కొంది. భారత్, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య నాలుగు రోజుల మొదటి టెస్టు ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు, రెండో మ్యాచ్ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతాయి. ఆతర్వాత ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ముంబయిలో ఆడతాయి. అయితే, ముందుగా జరిగిన ఒప్పందాలు, వార్ధా తుపాను సృష్టించిన విధ్వసం, ముఖ్యమంత్రి జయలలిత్ మృతి వంటి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలని టిఎన్‌సిఎ సూచించింది.
ముంబయి సిద్ధం: వెంగ్‌సర్కార్
ముంబయి: భారత్, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య రెండు టెస్టులను నిర్వహించేందుకు ముంబయి సిద్ధంగా ఉందని భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తెలిపాడు. కొన్ని కారణాలతో మ్యాచ్‌లను నిర్వహించే పరిస్థితి తమకు లేదని బిసిసిఐకి టిఎన్‌సిఎ లేఖ రాయడంపై అతను స్పందిస్తూ, అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు ముంబయిని మించిన సరైన వేదిక మరొకటి ఉండదని వ్యాఖ్యానించాడు. టిఎన్‌సిఎ కాదన్నంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిసిసిఐ అధికారులకు భరోసా ఇచ్చాడు.