క్రీడాభూమి

జోరు తగ్గని జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 28: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ దూకుడు కొనసాగుతున్నది. కెరీర్‌లో 17 పర్యాయాలు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన మూడో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌పై అతను తొలిసారి ఆధిక్యాన్ని సంపాదించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్ సెమీ ఫైనల్‌లో తన చిరకాల ప్రత్యర్థి ఫెదరర్‌ను 6-1, 6-2, 3-6, 6-3 తేడాతో ఓడించాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరువురు ఆటగాళ్లు 44 మ్యాచ్‌ల్లో పరస్పరం ఢీకొని, చెరి 22 విజయాలతో సమవుజ్జీలుగా నిలిచారు. తాజా విజయంతో ఫెదరర్‌పై జొకోవిచ్ తొలిసారి ఆధిక్యాన్ని సంపాదించాడు. 19వ సారి గ్రాండ్ శ్లామ్ ఫైనల్ చేరడం ద్వారా, అత్యధిక పర్యాయాలు టైటిల్ పోరులో పాల్గొన్న ఆటగాళ్ల జాబితాలో ఇవాన్ లెండిల్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. 27 పర్యాయాలు ఫైనల్ చేరిన రోజర్ ఫెదరర్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. రాఫెల్ నాదల్ 20 గ్రాండ్ శ్లామ్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడి రెండో స్థానంలో ఉన్నాడు.
పోరాడిన స్విస్ హీరో
స్విట్జర్లాండ్ హీరో రోజర్ ఫెదరర్ శక్తివంచన లేకుండా పోరాటం సాగించినా ఫలితం లేకపోయింది. అవాంఛనీయ పొరపాట్లు చేసిన అతను ఓటమిని కొనితెచ్చుకున్నారు. సుమారు గంట సేపు జరిగిన హోరాహోరీలో జొకోవిచ్‌పై పలుమార్లు ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, అంతలోనే అనూహ్యంగా నీరుగారి పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, 34 ఏళ్ల వయసులోనూ ఉత్సాహం తగ్గకుండా, తన కంటే ఆరేళ్లు చిన్నవాడైన జొకోవిచ్‌కు అతను గట్టిపోటీనిచ్చిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి మూడో సెట్‌లో విరుచుకుపడిన విధానానికి అభిమానులు జేజేలు పలికారు. ఆ సెట్‌ను గెల్చుకున్నప్పటికీ, ఆతర్వాత అదే స్థాయిలో ఆడలేకపోయిన ఫెదరర్ కన్నీళ్ల పర్యంతమవుతూ, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ నిష్క్రమించాడు.