క్రీడాభూమి

స్టార్ అట్రాక్షన్ యువీ, నెహ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 9: బ్రబౌర్న్ స్టేడియంలో మంగళవారం ఇంగ్లాండ్ ఎలెవెన్‌తో జరగబోయే ప్రాక్టీస్ మ్యాచ్‌కి టీమిండియా సిద్ధంకాగా, ప్రాక్టీస్ సెషన్‌లో అందరి దృష్టి యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రాలపై కేంద్రీకృతమైంది. చాలాకాలంగా ఫిట్నస్ సమస్యతో అల్లాడుతున్న నెహ్రా ఈసారి రంజీ సీజన్‌లో అత్యధిక మ్యాచ్‌లకు హాజరుకాలేదు. ఢిల్లీ తరఫున ఆడాల్సి ఉన్న ఈ 37 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అనూహ్యంగా, ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఫిట్నెస్‌పైనే ఒక స్పష్టత లేనప్పుడు అతను రాణిస్తాడా? లేదా? అన్న ప్రశ్నకు ఆస్కారమే లేదన్న పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే వనే్డ, టి-20 ప్రపంచ కప్‌లను దృష్టిలో ఉంచుకుంటే, యువ ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, సెలక్టర్లు ఏఏ అంశాలను దృష్టిలో ఉంచుకొని నెహ్రాను టి-20 సిరీస్‌కు ఎంపిక చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు 35 ఏళ్ల యువీ పరిస్థితి కూడా దాదాపు అదే. ఇంగ్లాండ్‌తో వనే్డ, టి-20 సిరీస్‌లకు ఎంపికైన అతను చివరిసారి భారత్‌కు నిరుడు మన దేశంలో మార్చి మాసంలో జరిగిన టి-20 ప్రపంచ కప్ పోటీల్లో కనిపించాడు. వరుసగా 18 మ్యాచ్‌ల్లో విఫలమై, సగటున కేవలం 18.53 పరుగులు చేయడంతో 2013లో అతను వనే్డ ఫార్మాట్‌లో స్థానం కోల్పోయాడు. అతనిని రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. ఈ రంజీ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి, ఒక డబుల్ సెంచరీ సాయంతో 672 పరుగులు చేయడాన్ని మినహాయిస్తే, యువీ సాధించింది ఏమీ లేదు. జాతీయ జట్టులో స్థానం కోసం ఎంతో మంది సమర్థులైన ఆటగాళ్లు పోటీపడుతున్న తరుణంలో యువీ, నెహ్రాలను టీమిండియాలోకి తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలావుంటే, సోమవారం ఇక్కడ భారత్ ‘ఎ’ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌కు హాజరైనప్పుడు, మంగళవారం నాటి మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించనున్న ధోనీతోపాటు యువీ, నెహ్రా కూడా స్టార్ అట్రాక్షన్‌గా నిలిచారు.

చిత్రాలు..యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా