క్రీడాభూమి

కెప్టెన్‌గా ధోనీ చివరి మ్యాచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 9: కెప్టెన్ హోదాలో మహేంధ్ర సింగ్ ధోనీ చివరి మ్యాచ్ ఆడుతుండడంతో, మంగళవారం భారత్ ‘ఎ’, ఇంగ్లాండ్ ఎలెవెన్ జట్ల మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల పోరు ఆసక్తిని రేపుతున్నది. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ మ్యాచ్‌ని ఇంగ్లాండ్ ఒక ప్రాక్టీస్ సెషన్‌గా భావిస్తున్నది. మ్యాచ్‌లో స్కోర్లకుగానీ, జయాపజయాలకుగానీ ఎలాంటి ప్రాధాన్యం లేకపోయినా, ఒక అంతర్జాతీయ జట్టుపై ఆడే భారత జట్టుకు ధోనీ చివరిసారి నాయకత్వం వహిస్తుండడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పై కేంద్రీకృతమైంది. సాధారణంగా వామప్ మ్యాచ్‌లకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరుకారు. స్టేడియం దాదాపుగా ఖాళీగా దర్శనమిస్తుంది. అయితే, ఒక అంతర్జాతీయ జట్టుపై ధోనీ కెప్టెన్సీ వహించడం ఇదే చివరిసారి కావడంతో, అభిమానులు పోటెత్తుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఒక రకంగా కెప్టెన్‌గా అతనికి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వీడ్కోలు మ్యాచ్‌గా చెప్పాలి. టికెట్లు ముద్రించి, వాటిని అమ్మడానికి తగినంత సమయం లేనందున ప్రేక్షకులను ఉచితంగా అనుమతించాలని ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) నిర్ణయించింది. అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తారని అధికారులు ధీమా వ్యక్తం చేయడానికి ఇది కూడా ఒక కారణం.
ఖర్చులు ఎవరివి?
టికెట్లు ముద్రించడానికి తగినంత సమయం లేదంటూ ఎంసిఎ చేతులు ఎత్తేయగా, భారీగా తరలివచ్చే ప్రజలను ఏ విధంగా కట్టడి చేయాలన్న విషయంపై భారత క్రికెట్ సెంటర్ (సిసిఐ) మల్లగుల్లాలు పడుతున్నది. పోలీసు బందోబస్తు నుంచి తీసుకుంటే, ఇరు జట్ల ఆటగాళ్ల వసతి, సౌకర్యాల కల్పన వరకూ మొత్తం 60 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తం ఎవరిస్తారనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. మ్యాచ్ జరిగే బ్రబౌర్న్ స్టేడియం సిసిఐ ఆజమాయిషిలో ఉంటుందని కాబట్టి, ఇందులో తమ ప్రమేయం లేదని ఎంసిఎ వాదిస్తున్నట్టు సమాచారం. పైగా సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి, బిసిసిఐ నుంచి ఇప్పటికిప్పుడు నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. ఎంసిఎ ఆర్థిక పరిస్థితికి లోటేమీ లేదు. కానీ, వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరిగితే తమ బాధ్యతనీ, లేకపోతే, సిసిఐ ఖర్చు భరించాలని ఎంసిఎ వాదించే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి భారత్ ‘ఎ’, ఇంగ్లాండ్ ఎలెవెన్ జట్ల మధ్య జరిగే మొదటి వామప్ మ్యాచ్‌కి ఖర్చులు ఎవరు భరిస్తారన్నది గోప్యంగానే ఉంది. ఇలావుంటే, భద్రతా ఏర్పాట్ల బాధ్యత తమదేనని బిసిసిఐ అధికారులు అంటున్నారు.

భారత్ ‘ఎ’: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్/ వికెట్‌కీపర్), శిఖర్ ధావన్, మన్దీప్ సింగ్, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్య, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, యుజ్‌వేంద్ర సింగ్ చాహల్, ఆశిష్ నెహ్రా, మోహిత్ శర్మ, సిద్ధాంత్ కౌల్.
ఇంగ్లాండ్ ఎలెవెన్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మోయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, జాక్ బాల్, శామ్ బిల్లింగ్స్, జొస్ బట్లర్, లియాం డాసన్, అలెక్స్ హాలెస్, లియాం ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్.

చిత్రం..మహేంద్ర సింగ్ ధోనీ