క్రీడాభూమి

హెచ్‌సిఎ అధ్యక్ష రేసులో అజరుద్దీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, జనవరి 10: టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) ఎన్నికల రేసులోకి దిగాడు. అధ్యక్ష పదవి కోసం మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశాడు. ఈ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు పర్వం మంగళవారం నాటితో ముగిసింది. ఈ ఎన్నికల్లో అన్ని పదవులకూ కలిపి మొత్తం 59 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్‌రెడ్డి తెలిపారు. అధ్యక్షపదవి కోసం అజరుద్దీన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ వివేక్, ఎనగాల వెంకట్‌రాంరెడ్డి, శేషునారాయణ, జాన్ మనోజ్ నామినేషన్లు దాఖలు చేశారని ఆయన వెల్లడించారు. హెచ్‌సిఎ ప్రధాన కార్యదర్శి పదవికి మొత్తం 31 దరఖాస్తులు దాఖలయ్యాయని రాజీవ్‌రెడ్డి తెలిపారు. ఇదిలావుంటే, హెచ్‌సిఎ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు అజారుద్దీన్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వస్తున్నాడని తెలిసి ఆయన అభిమానులు మంగళవారం భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. దీంతో స్టేడియం వద్ద సందడి నెలకొంది.
17న ఎన్నికలు
హెచ్‌సిఎ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అభ్యర్థులకు 12వ తేదీ వరకు గడువు ఉందని, ఈ పర్యం పూర్తయన తర్వాత 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 2గంటల వరకు పోలింగ్ జరుగుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్‌రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 240 మంది ఓటర్లు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.