క్రీడాభూమి

శ్రేయాస్‌కు స్కాటిష్ ఓపెన్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిన్‌బర్గ్, జనవరి 10: భారత అండర్-13 స్క్వాష్ ఆటగాడు శ్రేయాస్ మెహతా స్కాటిష్ జూనియర్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుని తన ప్రతిభను చాటుకున్నాడు. గతంలో యుఎస్ జూనియర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న శ్రేయాస్ తాజాగా స్కాటిష్ ఓపెన్ టోర్నీలో జువాన్ జోస్ టోరెస్ లారా (కొలంబియా)తో జరిగిన ఫైనల్ పోరులో ఓటమి కోరల నుంచి బయటపడి అద్భుత విజయం సాధించాడు. ఆరంభం నుంచే హోరాహోరీగా సాగిన ఈ పోరులో శ్రేయాస్ తొలి రెండు గేముల్లో 8-11, 8-11 తేడాతో వెనుకబడినప్పటికీ ఆ తర్వాత 11-5, 11-6, 11-7 తేడాతో వరుసగా మూడు గేముల్లో విజయం సాధించి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. దీంతో శ్రేయాస్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. యుఎస్ టోర్నీలో మాదిరిగానే ఇప్పుడు కూడా శ్రేయాస్ టైటిల్ రౌండ్‌కు చేరే వరకు ఒక్క గేమ్‌ను కూడా చేజార్చుకోకుండా అప్రతిహతంగా ముందుకు సాగడం ఒక విశేషమైతే, ఫైనల్‌కు చేరే క్రమంలో అతను సీడింగ్స్‌లో తన కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న స్కాట్లాండ్ ఆటగాడు బెన్ రాబర్ట్ జాన్ బారన్‌ను ఓడించడం మరో విశేషం.

ఆ తర్వాత ఫైనల్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ శ్రేయాస్ ఏమాత్రం వెనుకంజ వేయకుడా తీవ్రస్థాయిలో పోరాడి అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించడం గమనార్హం.