క్రీడాభూమి

రాయుడి శతకం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 10: విరాట్ కోహ్లీ సేనతో పరిమిత ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో తలపడటానికి ముందు మంగళవారం ఇక్కడి బ్రాబోర్న్ స్టేడియంలో ఇండియా-ఏ జట్టుతో జరిగిన తొలి సన్నాహక వనే్డ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఎలెవెన్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఎలెవెన్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ జట్టు 25 పరుగులకే ఓపెనర్ మన్‌దీప్ సింగ్ వికెట్‌ను కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ శిఖర్ ధావన్, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు నిలకడగా ఆడి 111 పరుగులు జోడించారు. 84 బంతుల్లో 63 పరుగులు సాధించిన తర్వాత ధావన్ నిష్క్రమించగా, 97 బంతుల్లో ఒక సిక్సర్, మరో 11 ఫోర్లతో సెంచరీ సాధించిన తర్వాత రాయుడు స్వచ్ఛందంగా క్రీజ్ నుంచి రిటైర్ అయ్యాడు. అనతరం జాతీయ జట్టులో మళ్లీ చోటు సంపాదించుకున్న యువరాజ్ సింగ్ 48 బంతుల్లో 56 పరుగులు సాధించి జాక్ బాల్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇవ్వగా, సంజూ శ్యాంసన్ (0) పరుగుల ఖాతా ఆరంభించకుండానే విల్లీ బౌలింగ్‌లో హాలెస్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (68), హార్దిక్ పాండ్యా (4) అజేయంగా నిలవడంతో ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 304 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ ఎలెవెన్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, జాక్ బాల్ చెరో రెండు వికెట్లు రాబట్టుకున్నారు.
అనంతరం 305 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఎలెవెన్ జట్టులో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (3), మొరుూన్ అలీ (0) మినహా మిగిలిన బ్యాట్స్‌మన్లంతా ఇండియా-ఏ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించి చక్కగా రాణించారు. దీంతో ఇంగ్లాండ్ ఎలెవెన్ 46 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 290 పరుగులు సాధించింది. ఆ తర్వాత క్రిస్ వోక్స్ (11), ఆదిల్ రషీద్ (6) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేయడంతో 48.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ ఎలెవెన్ జట్టు 3 వికెట్ల తేడాతో ఇండియా-ఏపై విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు కైవసం చేసుకోగా, హార్దిక్ పాండ్యా, యుజ్వేద్ర చాహాల్ చెరో వికెట్ రాబట్టారు.