క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు ఆయోనిక అర్హత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: ఇక్కడ జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ పోటీల్లో మన దేశానికి చెందిన ఆయోనికా పౌల్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఫైనల్లో అయోనికా పౌల్ రజత పతకాన్ని సాధించడంతో మన దేశం 11వ ఒలింపిక్ కోటాను పూర్తి చేసుకుంది. అయితే ఇదే విభాగంలో పోటీ పడిన పూజా ఘట్కర్ కొద్దిలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేక పోయింది. కామనె్వల్త్ క్రీడల్లో రజత పతక విజేత అయిన 24 ఏళ్ల అయోనిక ఎనిమిది మంది మహిళలు పాల్గొన్న ఫైనల్ పోటీలో మొత్తం 205.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే స్వర్ణ పతక విజేత అయిన ఇరాన్‌కు చెందిన నజ్మే ఖేద్మతి కూడా అనే్న పాయింట్లు సాధించడంతో షూటాఫ్ తప్పనిసరయింది. షూటాఫ్‌లో నజ్మే 10.1 పాయింట్లు సాధించగా అయోనిక 9.9 పాయింట్లు మాత్రమే సాధించడంతో రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. 17వ షాట్ దాకా అగ్రస్థానంలో కొనసాగిన పూజా 20 షాట్లు పూర్తయ్యే సరికి 184.5 పాయింట్లు మాత్రమే సాధించింది. 18వ షాట్ ఆమె పాలిట శాపంగా మారింది. దానిలో ఆమె కేవలం 8.8 పాయింట్లే సాధించింది. రియో ఒలింపిక్స్‌లో చిట్టచివరి కోటా కోసం ఇక్కడి డాక్టర్ కార్ని సింగ్ షూటింగ్ రేంజ్‌లో మూడు రోజులుగా ఈ పోటీలు జరుగుతున్నాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండు కోటాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంతకు ముందు జరిగిన పోటీల్లో అపూర్వి చందేలా ఒక కోటాను దక్కించుకోవడంతో భారత్‌కు ఒక కోటాకు మాత్రమే అవకాశం ఉండింది.

జిబ్రాల్టర్‌లో హారిక సంచలనం
జిబ్రాల్టర్, జనవరి 29: ఇక్కడ జరుగుతున్న జిబ్రాల్టర్ చెస్ కాంగ్రెస్‌లో శుక్రవారం మన దేశానికి చెందిన గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ చాంపియన్‌షిప్ మాజీ చాలెజర్, ఇంగ్లండ్‌కు చెందిన నిగెల్ షార్ట్‌పై సంచలన విజయం సాధించింది. కాగా, మాస్టర్స్ విభాగం మూడో రౌండ్‌లో విశ్వనాథన్ ఆనంద్ వరసగా రెండో విజయం సాధించాడు. ఆడిన మూడు గేములలోను విజయం సాధించిన హారిక మరో పదిమంది ఆటగాళ్లతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా, షార్ట్‌కు ఈ టోర్నమెంట్‌లో ఇది తొలి పరాజయం కావడం గమనార్హం. మన దేశానికే చెందిన ఎస్‌పి సేతురామన్, యువ గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం కూడా హారికతో పాటుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కాగా చైనాకు చెందిన జియాంగ్యు జుపై అద్భుత విజయం సాధించిన ఆనంద్ 2.5 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు.
ఢిల్లీ అద్భుత విజయం
ముంబయి, జనవరి 29: హాకీ ఇండియా లీగ్ టోర్నీలో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్ రైడర్స్ 4-3 గోల్స్ తేడాతో దబాంగ్ ముంబయిపై అద్భుత విజయం సాధించింది. ఆట చివరి క్షణాల్లో తల్వీందర్ సింగ్ అద్భుత ఫీల్డ్ గోల్ సాధించి ఢిల్లీని గెలిపించాడు. ప్రథమార్థం ముగిసే సమయానికి 2-1 గోల్స ఆధిక్యతలో ఉండిన ముంబయి ఆ ఆధిక్యతను నిలుపుకోలేక ఓటమిని కొనితెచ్చుకుంది. ఆ జట్టుకు ఇది వరసగా మూడోఓటమి.

విశాఖలో నేటి నుంచి
ప్రోకబడ్డీ సీజన్-3 లీగ్ పోటీలు

విశాఖపట్నం (స్పోర్ట్స్), జనవరి 29: ప్రోకబడ్డీ సీజన్-3 లీగ్ పోటీలు శనివారం విశాఖలో ప్రారంభం కానున్నాయి. నగరంలోని పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీలలో హోంటీం తెలుగు టైటాన్స్ జట్టుతో పాటు ముంబాయి, దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్‌పాంథర్స్, ఫనేరి పల్టాన్, పాట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్ జట్లు తలపడతాయి. నాలుగురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. వీరిలో 27 మంది విదేశీ క్రీడాకారులు కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు, డిఫెండింగ్ చాంపియన్స్ ముంబాయి జట్టుతో పోటీ పడనుంది. తెలుగు టైటాన్స్ జట్టులో స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి, సుఖేష్‌హెగ్టే, ప్రశాంత్‌రాయ్ ఆకర్షణగా నిలుస్తారు. అలాగే ముంబాయి జట్టులో అనుభవజ్ఞులైన అంతర్జాతీయ క్రీడాకారులు అనూప్‌కుమార్, షబ్బీర్ బాబు, రాఖేష్, సురేంద్రగౌడ్ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ పోటీలు సాయంత్రం 8 గంటలకు, 9 గంటలకు వరుసగా జరుగుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పోటీల ప్రారంభ ఉత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరుకానుండడంతో స్టేడియంలో మరింత హడావుడి నెలకోనుంది. ఈ పోటీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సినీనటుడు రాణాతో పాటు, బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ జాతీయ గీతాన్ని ఆలపించడానికి రానున్నారు.