క్రీడాభూమి

మ్యాచ్‌ల నిర్వహణకు భరోసా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే మ్యాచ్‌లకు అవాంతరాలేవీ ఉండబోవని రాష్ట్రాల క్రికెట్ సంఘాల నుంచి హామీలను పొందాలని బిసిసిఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఓ)కి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు లోధా కమిటీ గురువారం బిసిసిఐ సిఇఓకి ఆదేశాలను జారీ చేసింది. ఇటీవల అనర్హత వేటుకు గురైన కొంత మంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులు విచ్ఛిన్నకర వ్యూహాలతో మ్యాచ్‌లను అడ్డుకునేందుకు, సంస్కరణల అమలు విషయంలో బిసిసిఐ కొత్త పాలక వర్గానికి సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నిస్తుండటంతో గురువారం న్యూఢిల్లీలో సమావేశమైన జస్టిస్ లోధాతో పాటు త్రిసభ్య కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్న మాజీ న్యాయమూర్తులు అశోక్ భాన్, ఆర్‌వి.రవీంద్రన్ ఈ ఆదేశాలను జారీ చేశారు. అలాగే ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ), రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సిఎ)కి సంబంధించిన వివిధ అంశాలు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఆ సంఘాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని కూడా లోధా కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే కొత్త నిబంధనావళిని ఆమోదించి అమలులోకి తీసుకొస్తే తప్ప ఈ రెండు సంఘాలు తమ ఎన్నికల నిర్వహణ కోసం ఎదురు చూడక తప్పదేమోననిపిస్తోంది.
ఆర్‌సిఎ అధ్యక్ష పదవికి
రుచిర్ అర్హుడే : అబ్ది
న్యూఢిల్లీ, జనవరి 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోడీ కుమారుడైన రుచిర్ మోడీ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సిఎ) అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అర్హుడేనని ఆ సంఘ డిప్యుటీ ఉపాధ్యక్షుడు మహమూద్ అబ్ది పేర్కొన్నాడు. అయితే ఈ పదవిని చేపట్టేందుకు రుచిర్ సిద్ధమవుతున్నాడన్నది తన మాటల సారాంశం కాదని ఆయన చెప్పాడు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తదుపరి అధ్యక్షుడిగా రుచిర్ బాధ్యతలు చేపట్టడం ఖాయమని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ‘ఈ ఊహాగానాలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు. క్రికెట్ వ్యవహారాల ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను మేము ఆమోదించినప్పటికీ ఇంకా ఎన్నికల తేదీని ప్రకటించలేదు. నామినేషన్లమీ దాఖలు కాలేదు. అయినా ఇటువంటి ఊహాగానాలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని మహమూద్ అబ్ది పిటిఐ వార్తా సంస్థతో అన్నాడు. అయితే ఇప్పటికే ఇప్పటికే క్రికెట్ పాలనా వ్యవహారాల్లో ప్రవేశించిన 22 రుచిర్ ప్రస్తుతం అల్వార్ జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.