క్రీడాభూమి

ఎబిఎస్ క్లాసిక్ టెన్నిస్ క్వార్టర్స్‌కు పేస్ జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, జనవరి 11: న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరుగుతున్న ఎఎస్‌బి క్లాసిక్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, అతని కొత్త భాగస్వామి ఆండ్రీ సా (బ్రెజిల్) శుభారంభాన్ని సాధించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ పోరులో వీరు టాప్ సీడ్స్‌గా బరిలోకి దిగిన ట్రీట్ హుయి, మాక్స్ మిర్నీ జోడీకి షాక్ ఇచ్చి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. త్వరలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్‌కు సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీలో అన్‌సీడెడ్ జోడీగా బరిలో దిగిన పేస్, సా 7-6(3), 6-3 వరుస సెట్ల తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించారు. పేస్, సా చేతులు కలిపిన తర్వాత వీరికి ఇదే తొలి విజయం. కొద్ది రోజుల క్రితం ముగిసిన చెన్నై ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో వీరిద్దరూ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఎబిఎస్ క్లాసిక్ టోర్నీలో 74 నిమిషాల పాటు జరిగిన తొలి రౌండ్ పోరులో ఒకసారి సర్వీస్‌ను చేజార్చుకున్న పేస్, సా రెండుసార్లు ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేశారు. సెమీస్‌లో స్థానం కోసం వీరిద్దరూ వైల్డ్‌కార్డ్ జోడీ మార్కస్ డేనియల్, మార్సెలో డెలోలినెర్‌లతో తలపడనున్నారు.
సెమీస్‌కు సానియా
ఇదిలావుంటే, ఈ టోర్నీలో హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి బార్బరా స్ట్రికోవా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు 6-3, 6-4 తేడాతో వైల్డ్‌కార్డ్ జోడీ మాడిసన్ బ్రెంగిల్, అరినా రొడినోవాపై సునాయాసంగా విజయం సాధించారు.

చిత్రం... ఆరంభంలోనే అదరగొట్టిన పేస్, సా

ఆసీస్‌పై ఇంకా బాగా రాణిస్తా : పుజారా
ముంబయి, జనవరి 11 వచ్చే నెల ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే సిరీస్‌లో తాను ఇంతకు ముందుకన్నా మెరుగ్గా రాణిస్తానని టీమిండియా స్పెషలిస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అంటున్నాడు. పొరపాట్లనుంచి గుణపాఠాలు నేర్చుకున్నానని, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌పై జరిగిన సిరీస్‌లోకన్నా కూడా మెరుగ్గా రాణించాలని అనుకుంటున్నట్లు పుజారా చెప్పాడు. ఈ రెండు సిరీస్‌లలో తాను చేసిన తప్పులనుంచి పాఠాలు నేర్చుకున్నానని చెప్పిన పుజా రెండు సిరీస్‌లలో తాను చేసిన మంచి వాటిని కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఫిబ్రవరి 23నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆస్ట్రేలియా సిరీస్ గురించి బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పుజారా ఈ విషయం చెప్పాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ సవాలేనని, అయితే తాము అంతా ఒక జట్టుగా ఆడుతుండడమే కాకుండా న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లపై బాగా రాణించామని, అదీగాక తాము అయిదు టెస్టుల సిరీస్‌ను ఆడబోతున్నామని పుజారా అంటూ, అందువల్ల తాము గత ఏడాది ఆడినట్లుగానే బాగా ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. ముందుగా బంగ్లాదేశ్‌తో జరిగే ఒక టెస్టు మ్యాచ్‌లో ఆడిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే అయిదు టెస్టుల సిరీస్‌కు జట్టు సిద్ధం కావలసి ఉంటుందని చెప్పాడు.

బాంబ్రీ పురోగమనం

మెల్బోర్న్, జనవరి 11: ఆస్ట్రేలియా ఓపెన్ క్వాలిఫయర్స్‌లో భారత యువ ఆటగాడు యూకీ బాంబ్రీ శుభారంభాన్ని సాధించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అతను అమెరికాకు చెందిన ఏడవ సీడ్ ఆటగాడు స్ట్ఫోన్ కొజ్లోవ్‌ను వరుస సెట్ల తేడాతో మట్టికరిపించి రెండో రౌండ్‌లో ప్రవేశించాడు. మణికట్టు గాయం కారణంగా బాంబ్రీ గత ఏడాది దాదాపు సగం కాలం పాటు ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 534వ స్థానంలో కొనసాగుతున్న బాంబ్రీ ఈ మ్యాచ్‌లో తనకంటే ఎంతో మెరుగైన స్థానంలో (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 116వ స్థానంలో) ఉన్న కొజ్లోవ్‌పై 6-1, 6-4 తేడాతో సునాయాసంగా విజయం సాధించడం విశేషం. రెండో రౌండ్‌లో బాంబ్రీ సెర్బియా ఆటగాడు పెజా క్రిస్టిన్‌తో తలపడనున్నాడు. తొలి రౌండ్‌లో క్రిస్టిన్ 3-6, 6-1, 7-5 తేడాతో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జెనెక్ కోనర్‌పై విజయం సాధించాడు.
ఇదిలావుంటే, ఈ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు చెందిన మరో ఆటగాడు సాకేత్ మైనేనికి ఆదిలోనే చుక్కెదురైంది. జర్మనీకి చెందిన పీటర్ గొజోవ్‌స్కీతో పూర్తి ఏకపక్షంగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అతను 0-6, 2-6 తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.