బిజినెస్

ఉద్యాన రైతులకు కోల్డ్‌స్టోరేజ్ సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు లబ్ది చేకూర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తూ ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్ వెంకటరాంరెడ్డి నేతృత్వంలో వివిధ సంస్థలు, స్టేక్‌హోల్డర్లతో కూడిన రాష్టస్థ్రాయి సంప్రదింపుల సమావేశం బుధవారం ఇక్కడ జరిగింది. జిల్లాల్లో ఉండే ఉద్యాన పంటల్లో ప్రధాన పంటను ప్రోత్సహించడం, ఫార్మ్‌పాండ్స్ నిర్మాణంలో సాంకేతిక మార్పులు చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని రూపొందించడం, చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా కోల్డ్‌స్టోరేజ్‌ల సౌకర్యాలు కల్పించాలంటూ సిఫార్సులు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఉద్యాన సేద్యానికి అవసరమైన పరికరాలకు ఇస్తున్న సబ్సిడీ పరిమాణాన్ని పెంచాలని, హరిత గృహాల ఏర్పాటులో విస్తీర్ణాన్ని పెంచేందుకు సిఫార్సు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.
డిజిటల్ పేమెంట్లపై
గ్రామాల్లో పేటిఎమ్ శిక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 11: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులపై దేశవ్యాప్తంగా 200 గ్రామాలను ఎంపిక చేసి వ్యాపారులు, వినియోగదారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేటిఎమ్ ప్రకటించింది. ఇక్కడ స్థానిక గ్రామస్తులకు కూడా శిక్షణ ఇస్తారు. డిజిటల్ చెల్లింపుల వల్ల వచ్చే ప్రయోజనాలు వివరిస్తామని పేటిఎమ్ ఉపాధ్యక్షుడు అమిత్ సిన్హా తెలిపారు. ఇకపై దేశంలో ప్రతి పట్టణం, గ్రామాల్లో రెగ్యులర్‌గా డిజిటల్ చెల్లింపులపై వర్క్‌షాపులను నిర్వహించేందుకు ప్రణాళిక ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు తమ కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు తెలియజేశారు. 2020 నాటికి దేశంలో 50 కోట్ల మంది డిజిటల్ చెల్లింపులు చేసే విధంగా శిక్షణ ఇస్తామన్నారు.