క్రీడాభూమి

షిర్కేపై కేసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి పదవి నుంచి ఉద్వాసనకు గురైన అజయ్ షిర్కేపై కోర్టు కేసు తప్పకపోవచ్చని నిపుణులు అంటున్నారు. భారత్‌లో వనే్డ, టి-20 సిరీస్‌లు ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)కి మెయిల్‌ను పంపిన షిర్కే చిక్కుల్లో పడ్డాడు. భారత్ పర్యటనలో భద్రతాపరమైన అంశాలను సరిచూసుకోవాలని, సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, ప్రస్తుతం ఆటగాళ్లకు భద్రతనిచ్చే స్థితిలో బిసిసిఐ లేదని ఇసిబికి పంపిన ఇ-మెయిల్‌లో షిర్కే పేర్కొన్నాడు. దీనికి కంగారుపడిన ఇసిబి అధ్యక్షుడు గిలెస్ క్లార్క్ వెంటనే బిసిసిఐని వివరణ కోరాడు. ఆటగాళ్ల భద్రతకు భరోసా ఇవ్వాలని సూచించాడు. ఇసిబి కోరిన విధంగానే బిసిసిఐ హామీ పత్రాన్నిచ్చింది. ఇలావుంటే, ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండవని, మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న క్రికెట్ సంఘాలకు నిధులను విడుదల చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ ఇసిబికి షిర్కే మెయిల్ పంపడం దుమారం రేపుతున్నది. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని నిపుణుల అభిప్రాయం. లోధా సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న బిసిసిఐలోని ఒక వర్గం కూడా షిర్కే వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కాగా, ఇలాంటి లేఖలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయన్న వాదన కూడా వినిపిస్తున్నది. మొత్తం మీద ఏ రకంగా చూసినా షిర్కే మెడకు కోర్టు కేసుల ఉచ్చు బిగిసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
బిసిసిఐకి దూరంగానే..
మహారాష్ట్ర క్రికెట్ సంఘానికి షిర్కే ప్రస్తుతం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. బిసిసిఐ సమావేశాల్లో ప్రతి సభ్య యూనిట్ నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. అయితే, షిర్కేకు మాత్రం ఆ అవకాశం ఉండదని లోధా ప్యానెల్ తేల్చిచెప్పింది. తరచు వినిపిస్తున్న ప్రశ్నలకు గురువారం సమాధానాలిచ్చింది. షిర్కే ఇప్పటికే మూడు పర్యాయాలు బోర్డులో ఏదో ఒక హోదాలో పని చేశాడని, కాబట్టి అతను ఏ రకంగానూ బిసిసిఐ సమావేశాల్లో పాల్గొనేందుకు వీల్లేదని కమిటీ తేల్చిచెప్పింది. బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లో ఉన్నందున అతను కూడా బిసిసిఐలో బాధ్యతలు చేపట్టడానికి, సమావేశాలకు హాజరుకావడానికి అనర్హుడని పేర్కొంది.

చిత్రం..అజయ్ షిర్కే