క్రీడాభూమి

మెస్సీ ఫ్రీ కిక్ గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, జనవరి 12: కోపా డెల్ రే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ బార్సిలోనా క్వార్టర్ ఫైనల్స్ చేరింది. స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలచి, జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఒకానొక దశలో ఇరు జట్లు చెరి మూడు గోల్స్‌తో సమవుజ్జీగా నిలవగా, చివరి క్షణాల్లో మెస్సీ తనకు లభించిన ఫ్రీ కిక్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతను చేసిన గోల్‌తో బార్సిలోనా టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు మెరుగుపరచుకుంది.

చిత్రం..లియోనెల్ మెస్సీ