క్రీడాభూమి

ఆకట్టుకున్న పంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని సమర్థంగా భర్తీ చేయగలడన్న ముద్ర వేయించుకున్న యువ ఆటగాడు రిషభ్ పంత్ తనపై సెలక్టర్లు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన రెండో వామప్ మ్యాచ్‌లో అతను కీపర్‌గా రాణించాడు. నాలుగు క్యాచ్‌లు పట్టి, కీపర్‌గా సత్తా చాటుకున్నాడు. ఆతర్వాత బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. కేవలం 36 బంతులు ఎదుర్కొన్న ఈ 19 ఏళ్ల ఢిల్లీ యువకుడు 59 పరుగులు సాధించి, భారత్ ‘ఎ’ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని స్కోరులో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కీపర్‌గా అద్వితీయ ప్రతిభ కనబరచడమేగాక, ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్‌ను తన బ్యాటింగ్ నైపుణ్యంతో గెలిపించిన ధోనీకి దీటైన ఆటగాడు లభించడం కష్టమన్న అభిప్రాయాన్ని పంత్ పటాపంచలు చేస్తున్నాడు. అండర్-19 జట్టులో అద్వితీయ ప్రతిభతో తన ఉనికిని చాటుకున్న పంత్ మొదటిసారి భారత్ ‘ఎ’ తరఫున ఆడుతున్నప్పటికీ, ఎక్కడా తడబడకపోవడం విశేషం. ఎంతో అనుభవం ఉన్న కీపర్‌గా, అంతర్జాతీయ జట్లపై ఎన్నో మ్యాచ్‌లు ఆడిన సీనియర్‌లా అతను తన ప్రతిభాపాటవాలతో ప్రేక్షకులనను ఆకట్టుకున్నాడు.

చిత్రం.. రిషభ్ పంత్