క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు ముర్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 29: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే ఫైనల్‌కు చేరుకున్నాడు. శనివారం ఇక్కడ ఆద్యంతం ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌లో కెనడా ఆటగాడు మిలోస్ రవోనిక్‌ను ఓడించి ఈ టోర్నీలో ఐదోసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ముర్రే ఇంతకుముందు నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఎంతో సుదీర్ఘంగా 4 గంటల 3 నిమిషాల పాటు జరిగిన సెమీఫైనల్ పోరులో ముర్రే విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆరంభం నుంచే రవోనిక్ గట్టి పోటీ ఇవ్వడంతో 4-6 తేడాతో తొలి సెట్‌ను కోల్పోయిన ముర్రే ఆ తర్వాత పుంజుకుని 7-5 తేడాతో రెండో సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రవోనిక్ మళ్లీ విజృంభించి 6-7 తేడాతో మూడో సెట్‌ను గెలుచుకోవడంతో ముర్రే ఇబ్బందుల్లో పడినప్పటికీ ఏమాత్రం తొణకకుండా తనదైన శైలిలో పవర్‌ఫుల్ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా 6-4, 6-2 తేడాతో వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని రవోనిక్‌ను ఓడించిన ముర్రే కెరీర్‌లో మొత్తం మీద తొమ్మిదోసారి గ్రాండ్‌శ్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం అతను టైటిల్ కోసం ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్ గురువారం జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్‌లో ఇంతకుముందు మూడుసార్లు ముర్రేని మట్టికరిపించిన జొకోవిచ్‌కు ప్రస్తుతం అదనంగా మరో రోజు విశ్రాంతి కూడా లభించడం ఫైనల్ పోరులో ఎంతో కలిసొచ్చే అంశం.

తొమ్మిదోసారి గ్రాండ్‌శ్లామ్ ఫైనల్‌కు చేరిన ముర్రే