క్రీడాభూమి

గుర్తింపు పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) గుర్తింపును భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను జీవితకాల ఉపాధ్యక్షులుగా ఎన్నుకొన్నందుకు ఐఒఎ గుర్తింపును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంతో, వివాదం సద్దుమణిగింది. ఐఒఎ గుర్తింపును ప్రభుత్వం పునరుద్ధరించింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దని సూచిస్తూ, మళ్లీ ఎప్పుడు వాటిని అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భారత క్రీడా రంగంలో ప్రకంపనలు సృష్టించిన కల్మాడీ, చౌతాలా ఎన్నికపై సర్వత్రా వ్యతిరేక రావడంతో ఐఒఎ వెనకడుగు వేయక తప్పలేదు. అంతకు ముందు, అవినీతిపరులను ఎందుకు ఎన్నుకున్నారో తెలపాలంటూ ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఐఒఎ సమాధానం ఇవ్వలేదు. అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ దేశంలో లేని కారణంగా, నిర్ణీత గడువులోగా జవాబు ఇవ్వలేకపోతున్నామని కేంద్రానికి రాసిన లేఖలో ఐఒఎ పేర్కొంది. ఆయన తిరిగి వచ్చే వరకూ సమయం ఇవ్వాలని కోరింది. కానీ, ఐఒఎ విన్నపాన్ని కేంద్రం తోసిపుచ్చింది. సస్పెన్షన్ వేటుతో తన వైఖరిని స్పష్టం చేసింది.
జ్ఞానోదయం
పలు అవినీతి ఆరోపణలు, కుంభకోణాలపై కోర్టు కేసులను ఎదుర్కొంటున్న కల్మాడీ, చౌతాలాలకు జీవితకాల ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమైనా మొండి వైఖరిని ప్రదర్శించిన ఐఒఎ అధ్యక్షుడు రామచంద్రన్‌కు ఆలస్యంగా జ్ఞానోదయమైంది. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోవడంతో, రామచంద్రన్‌కు యూటర్న్ తీసుకోక తప్పలేదు. క్రీడలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అంటూనే, చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు కూడా నోరు మెదపకుండా కోర్చోబోమని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ తేల్చిచెప్పడం కూడా రామచంద్రన్‌ను ఆందోళనకు గురి చేసి ఉండవచ్చు. ఐఒఎ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకూ అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్టు గోయల్ చేసిన ప్రకటనతో రాజీకి రాకతప్పలేదు. కల్మాడీ, చౌతాలా ఎన్నిక తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు రెండు రోజుల క్రితం ఐఒఎ ప్రకటించింది. కేంద్రం వెంటనే స్పందించి, ఐఒఎ గుర్తింపును పునరుద్ధరించడంతో కథ సుఖాంతమైంది. అదే సమయంలో జాతీయ క్రీడా సమాఖ్యలు ఇ ష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమన్న విషయాన్ని కేంద్రం పరోక్షంగా స్పష్టం చేసింది.

చిత్రం..ఐఒఎ అధ్యక్షుడు రామచంద్రన్