క్రీడాభూమి

మెల్బోర్న్‌లో ‘స్టార్ వార్స్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 15: ఈ ఏడాది మొదటి టెన్నిస్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆధిపత్య పోరాటానికి పేరొందిన స్టార్లు సిద్ధంగా ఉన్నారు. సోమవారం నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో నొవాక్ జొకోవిచ్, ఏంజెలిక్ కెర్బర్ డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగుతుండగా, ఆండీ ముర్రే, సెరెనా విలియమ్స్ వంటి మేటి స్టార్లు టైటిల్‌పై కనే్నశారు. నిరుటి రన్నరప్ ముర్రే ఈసారి ప్రపంచ నంబర్ వన్‌గా పురుషుల సింగిల్స్‌లో తన ప్రస్థానాన్ని ఆరంభిస్తాడు. అయితే, అతని కోసం సంక్లిష్టమైన డ్రా ఎదురు చూస్తున్నది. అనుకున్న ఫలితాలు వెల్లడైతే, ఫైనల్ చేరే క్రమంలో అతను కెయ్ నిషికొరీ, స్టానిస్లాస్ వావ్రిన్కాలను ఓడించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఐదు పర్యాయాలు ఆస్ట్రేలియా ఓపెన్ వరకూ చేరినప్పటికీ విజేతగా నిలవలేకపోయిన ముర్రే ఈసారి టైటిల్‌పై ఎంతో నమ్మకంతో ఉన్నాడు. నిరుడు ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ను రెండోసారి గెల్చుకున్న అతను, ఒలింపిక్స్ టైటిల్‌ను కూడా సాధించాడు. అదే ఒరవడిని కొనసాగిస్తానని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కాగా, ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయినప్పటికీ, టైటిల్‌ను నిలబెట్టుకునే సత్తావున్న జొకోవిచ్ మొదటి రౌండ్‌లోనే స్పెయిన్ ఆటగాడు ఫెర్నాండో వెర్డాస్కోతో తలపడతాడు. ఇప్పటి వరకూ 13 పర్యాయాలు వెర్డాస్కోతో తలపడిన జొకోవిచ్ నాలుగు సార్లు పరాజయాలను చవిచూశాడు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అతను మొదటి రౌండ్ నుంచే జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఏర్పడింది. అంచనాల ప్రకారమే ఫలితాలు వస్తే, అతను నాలుగో రౌండ్‌లో గ్రిగర్ దిమిత్రోవ్‌ను, క్వార్టర్ ఫైనల్స్‌లో డొమినిక్ థియామ్‌ను ఎదుర్కొంటాడు. సెమీస్‌లో మూడో సీడ్ మిలోస్ రానిక్ నుంచి సవాళ్లు ఎదురుకావచ్చు.
టైటిల్ వేటలో సెరెనా
ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ను వేటను కొనసాగించనుంది. కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసిన ఆమె నిరుడు ఫైనల్‌లో అనూహ్యంగా ఓడింది. ఏంజెలిక్ కెర్బర్ 6-4, 3-6, 6-4 ఆధిక్యంతో టైటిల్‌ను అందుకుంది. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకూ ఆరు పర్యాయాలు ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను అందుకున్న సెరెనా, చివరిసారి 2015లో విజేతగా నిలిచింది. నిరుడు ఎదురైన ఓటమి సెరెనాలో పట్టుదలను పెంచింది. ముర్రే మాదిరిగానే సెరెనా కూడా ప్రపంచ నంబర్ వన్. నిరుడు ఫైనల్‌లో ఓడి, ఈసారి రన్నరప్ హోదాలో గోదాలో ఉంది. మొదటి రౌండ్‌లో ఆమెకు ప్రపంచ మాజీ నంబర్ సెవెన్ క్రీడాకారిణి బెలిండా బెన్సిక్ ఎదురవుతుంది. ఆ అడ్డంకిని అధిగమిస్తే, మూడో రౌండ్ వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని విశే్లషకులు అంటున్నారు. అయితే, నాలుగో రౌండ్‌లో ఆమెకు బ్రిటొన్ జొహానా కొన్టా నుంచి పోటీపతప్పదు. క్వార్టర్స్‌లో ఆరోసీడ్ డొమినికా సిబుల్కొవాతో తలపడాల్సి ఉంటుంది. అక్కడ కూడా నెగ్గితే, సెమీ ఫైనల్స్‌లో కరోవలినా ప్లిస్కోవాను ఢీ కొంటుంది. మొత్తం మీద సెరెనా కోసం ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంక్లిష్టమైన డ్రా ఎదురుచూస్తున్నది. డిఫెండింగ్ చాంపియన్ కెర్బర్, గార్బెనె ముగురుజా, ప్రపంచ నంబర్ వన్ జొహన్నా కొన్టా, రష్యా టీనేజర్ దరియా కసట్కినా, యొగెనీ బుచార్డ్, సిమోనా హాలెప్, ఎలెనా స్విటోలినా తదితరులు టైటిల్ రేసులో ముందున్నారు. స్థూలంగా చూస్తే పురుషుల విభాగం కంటే మహిళల విభాగంలో ఈసారి పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి.