క్రీడాభూమి

రెండో వనే్డలో పాక్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 15: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. 2005 జనవరి తర్వాత ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను పాక్ ఇప్పటి వరకూ ఏ ఫార్మాట్‌లోనూ ఓడించలేకపోయింది. సుమారు 11 సంవత్సరాల విరామం తర్వాత పాక్ తొలిసారి ఆసీస్ గడ్డపై ఓ విజయాన్ని నమోదు చేసింది. 221 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 47.4 ఓవర్లలో, నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 48.2 ఓవర్లలో 220 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (60), వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ (35), ట్రావిస్ హెడ్ (29) జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించారు. మిగతా వారు రాణించలేకపోవడంతో ఆసీస్ భారీ స్కోరు చేయలేకపోయింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ మూడు, జునైద్ ఖాన్, ఇమాద్ వాసిం చెరి 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ (72), షర్జీల్ ఖాన్ (29) చక్కటి పునాది వేశారు. మొదటి వికెట్‌ను వీరు 68 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఫస్ట్‌డౌన్ ఆటగాడు బాబర్ ఆజం 34 పరుగులు చేయగా, చివరిలో షోయబ్ మాలిక్ (42 నాటౌట్), ఉమర్ అక్మల్ (18 నాటౌట్) పాక్‌ను విజయపథంలో నడిపారు. కాగా, మొదటి వనే్డను ఆస్ట్రేలియా గెల్చుకోగా, రెండో మ్యాచ్‌ని పాక్ గెల్చుకోవడంతో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి.