క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన పార్థీవ్ సేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, జనవరి 15: రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న పార్థీవ్ పటేల్ నాయకత్వంలోని గుజరాత్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో పటిష్టమైన డిఫెండింగ్ చాంపియన్ ముంబయిని 5 వికెట్ల తేడాతో ఓడించి, మొట్టమొదటిసారి రంజీ విజేతగా నిలిచింది. 41 పర్యాయాలు రంజీ ట్రోఫీని సాధించి, మరో టైటిల్‌పై కనే్నసిన ముంబయిని ఓడించడంలో పార్థీవ్ పటేల్ కీలక పాత్ర పోషించడం విశేషం. 312 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్‌కు అండగా నిలిచిన అతను 196 బంతులు ఎదుర్కొని, 24 ఫోర్లతో 143 పరుగులు సాధించాడు. మన్‌ప్రీత్ జునేజా (54) అతనికి చక్కటి సహకారం అందించడంతో గుజరాత్ 89.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసి, విజయభేరి మోగించింది. 65 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ఫైనల్ చేసిన ఈ జట్టు తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. 1951లో గుజరాత్ తొలిసారి రంజీ ఫైనల్ చేరింది. అయితే, హోల్కర్ చేతిలో 189 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీకి పరిమితమైంది. ఆరున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ఫైనల్ చేరింది. ఈ సారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, టైటిల్‌ను అందుకుంది. కాగా, 46వసారి రంజీ ట్రోఫీలో ఫైనల్ చేరిన ముంబయి ఐదోసారి పరాజయాన్ని చవిచూసింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబయి తొలి ఇన్నింగ్స్: 83.5 ఓవర్లలో 228 ఆలౌట్ (పృథ్వీ షా 77, సూర్యకుమార్ యాదవ్ 57, అభిషేక్ నాయర్ 35, ఆర్పీ సింగ్ 2/48, చింతన్ గజా 2/46, రుజుల్ భట్ 2/5).
గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 104.3 ఓవర్లలో 328 ఆలౌట్ (్భర్గవ్ మెరాయ్ 45, పార్థీవ్ పటేల్ 90, మన్‌ప్రీత్ జునేజా 77, శార్దూల్ ఠాకూర్ 4/84, బల్వీందర్ సంధు 3/63, అభిషేక్ నాయర్ 3/54).
ముంబయి రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 67 ఓవర్లలో 3 వికెట్లకు 208): పృథ్వీ షా 44, శ్రేయాస్ అయ్యర్ 82, సూర్యకుమార్ యాదవ్ 49, ఆదిత్య తారే 69, అభిషేక్ నాయర్ 91, చింతన్ గజా 6/121, ఆర్పీ సింగ్ 2/83).
గుజరాత్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 312): 89.5 ఓవర్లలో 5 వికెట్లకు 313 (పార్థీవ్ పటేల్ 143, మన్‌ప్రీత్ జునేజా 54, బల్వీందర్ సంధు 2/101).