క్రీడాభూమి

చెలరేగిన కోహ్లీ, జాదవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, జనవరి 15: టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన టీమిండియా వనే్డల్లోనూ బోణీ చేసింది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌ని మూడు వికెట్ల తేడాతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీ ఈ విజయంతో శుభారంభం చేశాడు. అంతేగాక, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, కెరీర్‌లో 27వ సెంచరీ సాధించాడు. మరో సెంచరీ హీరో, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేదార్ జాదవ్‌తో కలిసి అతను ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ 350 పరుగుల భారీ స్కోరును సాధించినప్పటికీ, మరో 11 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.
టాస్ గెలిచి ఫీల్డింగ్
బ్యాటింగ్ బలంపై అపారమైన నమ్మకం ఉన్న కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన జాసన్ రాయ్, అలెక్స్ హాలెస్ మొదటి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. హాలెస్ 18 బంతులు ఎదుర్కొని, తొమ్మిది పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. దీనితో ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. అయితే, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన జో రూట్‌తో కలిసి జాసన్ రాయ్ ఇన్నింగ్స్‌ను చక్కద్ది, స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించాడు. 61 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లతో 73 పరుగులు చేసిన అతనిని వికెట్‌కీపర్ ధోనీ క్యాచ్ అందుకోగా రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (28), జొస్ బట్లర్ (31) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ధోనీ క్యాచ్ పట్టగా మోర్గాన్‌ను హార్దిక్ పాండ్య వెనక్కు పంపాడు. బట్లర్ కూడా అతని బౌలింగ్‌లోనే శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాగా, 95 బంతుల్లో 78 పరుగులు సాధించిన జో రూట్‌ను జస్‌ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో రాణించిన అతను హార్దిక్ పాండ్య చక్కటి క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. చివరిలో బెన్ స్టోక్స్ విజృంభణ ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. భారత బౌలింగ్‌పై విరుచుకుపడిన అతను 40 బంతుల్లోనే 62 పరుగులు చేసి, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. మోయిన్ అలీ 28 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌కాగా, క్రిస్ వోక్స్ (9), డేవిడ్ విల్లే (10) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
ఆరంభంలో తడబాటు
ఇంగ్లాండ్‌ను ఓడించి, మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో శుభారంభం చేయడానికి 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, టీమిండియా ఇన్నింగ్స్ నిరాశాజనకంగా మొదలైంది. ఆరంభంలో తడబడిన భారత్ కేవలం 13 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్‌ను శిఖర్ ధావన్ రూపంలో కోల్పోయింది. పది బంతులు ఎదుర్కొన్న అతను కేవలం ఒక పరుగు చేసి, డేవిడ్ విల్లే బౌలింగ్‌లో మోయిన్ అలీకి సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యువరాజ్ సింగ్ (15), ఇటీవలే పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగిన ధోనీ (6) కూడా ప్రేక్షకులను నిరాశ పరిచారు. 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లీ, జాదవ్ దాడి మొదలైంది. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, పరుగుల వరద పారించారు. ప్రత్యేకించి జాదవ్ విజృంభణ ఇంగ్లాండ్ బౌలర్లను ఆందోళనకు గురి చేసింది. 98 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు క్రిస్ వోక్స్ వేసిన ఓవర్ తొలి బంతిలో సింగిల్స్ తీసిన కోహ్లీ నాన్‌స్ట్రయికింగ్ ఎండ్ చేరాడు. అయితే, జాదవ్ సింగిల్ తీయడంతో మళ్లీ అతనికే స్ట్రయికింగ్ లభించింది. వరుసగా మూడు బంతులను రక్షణాత్మకంగా ఆడిన కోహ్లీ, చివరి బంతిని భారీ సిక్స్‌గా కొట్టి, కెరీర్‌లో 27వ వనే్డ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం మీద 105 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో 122 పరుగులు చేసిన కోహ్లీని బెన్ స్టోక్స్ అవుట్ చేశాడు. డేవిడ్ విల్లే క్యాచ్ పట్టగా కోహ్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. జాదవ్‌తో కలిసి అతను ఐదో వికెట్‌కు సరిగ్గా 200 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం విశేషం.
కాగా, తర్వాత కొద్ది సేపటికే జాదవ్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. అతను 76 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 120 పరుగులు చేసి, బెన్ స్టోక్స్ క్యాచ్ పట్టగా జాక్ బాల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అంతకు ముందు కాలి కండరాల నొప్పితో బాధపడిన అతను ఆ కారణంగానే ఆటపై దృష్టిని కేంద్రీకరించి వికెట్ చేజార్చుకున్నట్టు స్పష్టమవుతోంది. హార్దిక్ పాండ్యతో కలిసి ఏడో వికెట్‌కు 4.2 ఓవర్లలో 27 పరుగులు జోడించిన తర్వాత, జాక్ బాల్ బౌలింగ్‌లో, అదిల్ రషీద్ క్యాచ్ పట్టగా రవీంద్ర జడేజా (13) అవుటయ్యాడు. హార్దిక్ పాండ్య (37 బంతుల్లో 40 నాటౌట్), అశ్విన్ (10 బంతుల్లో 15 నాటౌట్) జోడీ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. మోయిన్ అలీ బౌలింగ్ బౌలింగ్‌లో అశ్విన్ భారీ సిక్స్ కొట్టడంతో భారత్ పరుగుల వేట ముగిసింది. కీలక సమయంలో ధాటిగా బ్యాటింగ్ చేసిన జాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

స్కోరుబోర్డు

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ స్టెంప్డ్ ధోనీ బి రవీంద్ర జడేజా 73, అలెక్స్ హాలెస్ రనౌట్ 9, జో రూట్ సి హార్దిక్ పాండ్య బి జస్‌ప్రీత్ బుమ్రా 78, ఇయాన్ మోర్గాన్ సి ధోనీ బి హార్దిక్ పాండ్య 28, జొస్ బట్లర్ సి శిఖర్ ధావన్ బి హార్దిక్ పాండ్య 31, బెన్ స్టోక్స్ సి ఉమేష్ యాదవ్ బి జస్‌ప్రీత్ బుమ్రా 62, మోయిన్ అలీ బి ఉమేష్ యాదవ్ 28, క్రిస్ వోక్స్ 9 నాటౌట్, డేవిడ్ విల్లే 10 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 22, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 350.
వికెట్ల పతనం: 1-39, 2-108, 3-157, 4-220, 5-244, 6-317, 7-336.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 7-0-63-1, హార్దిక్ పాండ్య 9-0-46-2, జస్‌ప్రీత్ బుమ్రా 10-0-79-2, రవీంద్ర జడేజా 10-0-50-1, రవిచంద్రన్ అశ్విన్ 8-0-63-0, కేదార్ జాదవ్ 4-0-23-0, యువరాజ్ సింగ్ 2-0-14-0.
భారత్ ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ బి డేవిడ్ విల్లే 8, శిఖర్ ధావన్ సి మోయిన్ అలీ బి డేవిడ్ విల్లే 1, విరాట్ కోహ్లీ సి డేవిడ్ విల్లే బి బెన్ స్టోక్స్ 122, యువరాజ్ సింగ్ సి జొస్ బట్లర్ బి బెన్ స్టోక్స్ 15, మహేంద్ర సింగ్ ధోనీ సి డేవిడ్ విల్లే బి జాక్ బాల్ 6, కేదార్ జాదవ్ సి బెన్ స్టోక్స్ బి జాక్ బాల్ 120, రవీంద్ర జడేజా సి అదిల్ రషీద్ బి జాక్ బాల్ 13, హార్దిక్ పాండ్య 40 నాటౌట్, అశ్విన్ 15 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 16,
మొత్తం (48.1 ఓవర్లలో 7 వికెట్లకు) 356.
వికెట్ల పతనం: 1-13, 2-24, 3-56, 4-63, 5-263, 6-291, 7-318.
బౌలింగ్: క్రిస్ వోక్స్ 8-0-44-0, డేవిడ్ విల్లే 6-0-47-2, జాక్ బాల్ 10-0-67-3, బెన్ స్టోక్స్ 10-0-73-2, అదిల్ రషీద్ 5-0-50-0, మోయిన్ అలీ 6.1-0-48-0, జో రూట్ 3-0-22-0.

చిత్రం.. సెంచరీ హీరో, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేదార్ జాదవ్‌