క్రీడాభూమి

ధోనీ డిఆర్‌ఎస్ అప్పీల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, జనవరి 16: టీమిండియా కెప్టెన్ ఎవరు? ఎవరైనా వెంటనే విరాట్ కోహ్లీ పేరు చెప్తారు. అయితే, ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మొదటి వనే్డ మ్యాచ్‌ని తిలకించిన వారు మరో సమాధానం వినిపించే అవకాశం ఉంది. కోహ్లీ అనుమతి కోసం ఎదురు చూడకుండా మహేంద్ర సింగ్ ధోనీ డిఆర్‌ఎస్ అప్పీల్ చేయడమే ఇందుకు కారణం. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి ధోనీ వైదొలగ్గా, టెస్టులతోపాటు వనే్డ, టి-20ల్లోనూ భారత్ జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతను కోహ్లీ స్వీకరించిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయి కెప్టెన్‌గా కోహ్లీ తొలి వనే్డను ఇంగ్లాండ్‌తో ఆదివారం ఆడాడు. చాలాకాలం తర్వాత ధోనీ టీమిండియాలో ఒక ఆటగాడిగా మైదానంలో కనిపించాడు. ఈ నేపథ్యంలో, వీరిద్దరి ప్రవర్తనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు హార్దిక్ పాండ్య వేసిన బంతికి ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బీటయ్యాడు. దానిని కాట్ బిహైండ్‌గా పాండ్యతోపాటు ఇతర ఫీల్డర్లు కూడా అప్పీల్ చేశారు. బంతికి తగులుతూ బాల్ తన చేతుల్లోకి వచ్చిందని నమ్మిన ధోనీ కూడా అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీనిపై తీవ్రంగా స్పందించిన ధోనీ తాను జట్టులో సాధారణ సభ్యుడినేనన్న విషయాన్ని పట్టించుకోకుండా అంపైర్ డిసిషన్ రివ్యూ విధానం (డిఆర్‌ఎస్) కోసం థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. నిజానికి ఒక జట్టు కెప్టెన్‌కు మాత్రమే డిఆర్‌ఎస్ అప్పీల్ హక్కు ఉంటుంది. సహచరులు అప్పీల్ కోసం డిమాండ్ చేసినా, అధికారికంగా కెప్టెన్ మాత్రమే అప్పీల్ చేయాలి. కానీ, కోహ్లీకి చెప్పకుండా, కనీసం అతని అనుమతిని తీసుకోకుండా ధోనీ నేరుగా డిఆర్‌ఎస్ అప్పీల్ చేయడం అందరినీ క్షణకాలం గందరగోళానికి గురి చేసింది. పరిస్థితి గమనించిన కోహ్లీ వెంటనే డిఆర్‌ఎస్ అప్పీల్ చేశాడు. ఈ సంఘటనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కోహ్లీ స్పందిస్తూ, ధోనీ నిర్ణయాల్లో ఎప్పుడూ పొరపాట్లు ఉండవని వ్యాఖ్యానించాడు. అందుకే, ధోనీ చేసిన డిఆర్‌ఎస్ అప్పీల్స్‌లో 95 శాతం అనుకూలంగానే నిర్ణయం వెలువడిందని చెప్పాడు. అతను అప్పీల్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నాడు. దీనితో ధోనీ అప్పీల్ ఎలాంటి వివాదం లేకుండా ముగిసింది. బహుశా తాను కెప్టెన్‌ను కానన్న విషయాన్ని అతను మరచిపోయి ఉండవచ్చు! అలవాటులో పొరపాటుగా డిఆర్‌ఎస్‌కు అప్పీల్ చేసి ఉండొచ్చు.