క్రీడాభూమి

సైనాకు ఫిట్నెస్ పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరవాక్ (మలేసియా), జనవరి 16: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫిట్నెస్‌కు క్వాలిఫయర్స్‌తో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నీ పరీక్ష పెట్టనుంది. నిరుడు పాదానికి గాయం, ఆతర్వాత మోకాలికి శస్త్ర చికిత్స సైనా ఫామ్‌ను దారుణంగా దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆమె పలు టోర్నీలకు దూరమైంది. పాల్గొన్న టోర్నీల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన ఆమె రియోలో కనీసం క్వార్టర్స్ కూడా చేరలేకపోయింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుంది. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ కెరీర్‌ను మొదలుపెట్టినప్పటికీ, పూర్వ వైభవాన్ని సంతరించుకోలేకపోయింది. మకావూ ఓపెన్, హాంకాంగ్ ఓపెన్ టోర్నీల్లో క్వార్టర్స్ చేరడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శనలు. ఈఏడాది ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లో పాల్గొనడం ద్వారా ఆమెకు అంతర్జాతీయ టోర్నీలకు అవసరమైన ప్రాక్టీస్ లభించింది. ఆ టోర్నీలో అవాధే వారియర్స్ సెమీ ఫైనల్స్ చేరడంతో కీలక పాత్ర పోషించింది. మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆమె మూడు విజయాలు సాధించింది. రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్, రజత పతక గ్రహీత పివి సింధు చేతిలో పరాజయాలను చవిచూసింది. మొత్తం మీద క్రమంగా మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న ఆమె ఈ ఏటి మొదటి గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ సిరీస్ మలేసియా మాస్టర్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నది. ఇలావుంటే, పిబిఎల్‌లో ఆడుతున్నప్పుడు భుజం కండరాలు బెణకడంతో విశ్రాంతి తీసుకుంటున్న పారుపల్లి కశ్యప్ ఈసారి మలేసియా మాస్టర్స్‌కు హాజరుకావడం లేదు.

చిత్రం..సైనా నెహ్వాల్