క్రీడాభూమి

అదేమంత సులభం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: సచిన్ తెండూల్కర్ స్థాయిలో ఆడడం, అతని మాదిరి మారథాన్ కెరీర్‌ను అందుకోవడం సులభసాధ్యం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 24 సంవత్సరాలు భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందించిన సచిన్ 2013 నవంబర్‌లో, కెరీర్‌లో 200వ టెస్టు ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకు ముందు 2011లో భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించినప్పుడు, సహచరులతో కలిసి కోహ్లీ అతనిని భుజాలపైకి ఎత్తుకొని మైదానంలో ఊరేగించాడు. ఆ సమయంలో అతను మాట్లాడుతూ ‘సచిన్ ఇంత వరకూ 21 సంవత్సరాలు భారత క్రికెట్‌ను తన భుజాలపై మోశాడు. ఇప్పుడు ఆ బాధ్యతను స్వీకరించడం మా కర్తవ్యం’ అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు ఎందుకు అన్నాడోగానీ, భారత క్రికెట్‌లో సచిన్ వారసత్వాన్ని కోహ్లీ కొనసాగిస్తున్నాడు. బిసిసిఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, తాను సచిన్ గురించి ఐదేళ్ల క్రితం ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యానించానో తనకే తెలియదని అన్నాడు. అసంకల్పితంగానే తాను ఆ మాటలు అన్నానని, అయితే, సచిన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోవడం, ముందుకు తీసుకెళ్లడం సులభం కాదని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు ఆషామాషి వ్యవహారం కాదని, అందుకే సచిన్‌తో పోల్చతగ్గ స్థాయిలో ఆడడం తనకు సాధ్యం కాకపోవచ్చని స్పష్టం చేశాడు. కానీ, జట్టుకు అత్యుత్తమ సేవలు అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పాడు.
వ్యూహాలే కీలకం..
ఒక మ్యాచ్‌లో జయాపజయాలకు వ్యూహాలే కీలకమని కోహ్లీ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్ గురించి అతను ప్రస్తావిస్తూ, తొలుత బ్యాటింగ్ చేస్తే, నిర్దిష్టమైన స్కోర్లు ఏమీ కళ్ల ముందు ఉండవు కాబట్టి, సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు. అయితే, లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అలాంటి అవకాశం ఉండదని, సాధించాల్సిన స్కోరుపై స్పష్టత ఉంటుంది కాబట్టి, దానిని అందుకోవడానికి సరైన దిశగా సాగాలని చెప్పాడు. కనీసం చివరి 20 ఓవర్లలో బ్యాటింగ్ చేసే అవకాశం తనకు లభిస్తుందని అంచనా వేశానని చెప్పాడు. పరిస్థితులకు, సామర్థ్యానికి మధ్య తేడా రాకుండా జాగ్రత్త పడితే, అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అన్నాడు. స్కోరు బోర్డు నిరంతరం ముందుకు కదిలేలా జాగ్రత్త పడడమే తమ విజయ రహస్యమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

చిత్రం..విరాట్ కోహ్లీ