క్రీడాభూమి

హాలెప్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 16: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న సిమోనా హాలెప్ సోమవారం ఇక్కడ మొదలైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్ నుంచే నిష్క్రమించింది. నిరుడు షుయ్ జాంగ్ చేతిలో ఓటమిపాలైన ఆమె ఈసారి కూడా అభిమానులను నిరాశ పరచింది. మొదటి రౌండ్‌లో అమెరికాకు చెందిన షెల్బీ రోజర్స్‌తో తలపడిన హాలెప్ 3-6, 1-6 తేడాతో ఓటమిపాలైంది. చాలాకాలంగా ఫిట్నెస్ సమస్యతో అల్లాడుతున్న హాలెప్‌ను మోకాలి నొప్పి తీవ్రంగా వేధిస్తున్నట్టు ఆమె ఆడిన తీరు స్పష్టం చేసింది. గతంలో రెండు పర్యాయాలు మెల్బోర్న్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరిన ఆమె వరుసగా రెండేళ్లు మొదటి రౌండ్ నుంచే వెనుదిరగడం ఆమె ఫిట్నెస్‌తోపాటు ఫామ్‌పైనా అనుమానాలకు తావిస్తున్నాయి.
ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్న వారిలో ఎక్కువ వయసున్న క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ మొదటి రౌండ్‌ను సమర్థంగా ముగించింది. 36 ఏళ్ల ఈ ప్రపంచ మాజీ నంబర్ వన్ 7-6, 7-5 తేడాతో 22 ఏళ్ల కాతెరిన కొజ్లొవాను ఓడించింది. నిరుడు హాలెప్‌ను మొదటి రౌండ్‌లోనే ఓడించిన షుయ్ ఈసారి తొలి రౌండ్‌లో అలిక్సాండ్రా సన్సోవిచ్‌ను 6-0, 6-3 తేడాతో చిత్తుచేసింది. ఒలింపిక్ చాంపియన్ మోనికా పగ్ 6-0, 6-1 ఆధిక్యంతో పెట్రిసియా టిగ్‌పై సులభంగా నెగ్గింది.
ప్రపంచ నంబర్ వన్ ఏంజెలిక్ కెర్బన్ 6-2, 5-7, 6-2 స్కోరుతో లీసా సురెన్కోపై గెలిచి, రెండో రౌండ్ చేరింది. ఏడోసీడ్ గార్బినె ముగురుజా 7-5, 6-4 ఆధిక్యంతో మరినా ఎరకొవిచ్‌పై గెలిచింది. మొదటి రౌండ్ మ్యాచ్‌ని 6-1, 7-6 తేడాతో గెలిచిన పదిహేనో సీడ్ రాబర్టా విన్సీకి కొకొ వండెవాగ్ షాకిచ్చింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఆష్లే బార్టీ 6-4, 7-5 తేడాతో అనికా బెక్‌ను ఓడించింది. ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా 6-0, 6-1 స్కోరుతో మరియానా డక్ మరినోపై గెలిచింది.
ముర్రే ముందంజ
ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో అతను ఇల్యా మర్చెన్కోపై 7-5, 7-6, 6-2 ఆధిక్యంతో విజయం సాధించాడు. బెర్నార్డ్ టామిక్ 6-2, 6-1, 6-4 స్కోరుతో తమాజ్ బెలుసీని ఓడించాడు. చివరి వరకూ హోరాహోరీగా సాగిన మారథాన్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా 4-6, 6-4, 7-6, 4-6, 6-4 తేడాతో మార్టిన్ క్లిజాన్‌పై గెలిచాడు. జపాన్ స్టార్ కెయ్ నిషికొరీ కూడా తన ప్రత్యర్థిపై చెమటోడ్చి నెగ్గాడు. ఆండ్రె కుజ్నెత్సొవ్‌ను ఢీకొన్న అతను 5-7, 6-1, 6-4, 6-7, 6-2 స్కోరుతో గెలుపొంది, రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. నిక్ కిర్గియోస్ 6-1, 6-2, 6-2 తేడాతో గాస్టావో ఇలియాస్‌పై నెగ్గాడు.

చిత్రం..వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఓడిన హాలెప్