క్రీడాభూమి

కోర్టును ఆశ్రయించిన అజార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)కు మంగళవారం జరిగిన ఎన్నికలను సవాలు చేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు నేషనల్ క్రికెట్ క్లబ్ తరఫున అజారుద్దీన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో ఆయన ఈ చర్య చేపట్టాడు. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉందన్న ఆరోపణల మేరకు అజారుద్దీన్‌పై విధించిన నిషేధాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఎత్తివేసిందని రుజువుచేసే ఆధారాలను సమర్పించకపోవడంతో అతని నామినేషన్ పత్రాలను స్వీకరించలేకపోయామని రిటర్నింగ్ అధికారి శనివారం స్పష్టం చేశాడు.
భారత క్రికెట్ జట్టుకు దీర్ఘకాలం పాటు సారథ్యం వహించిన వారిలో ఒకడైన అజారుద్దీన్‌కు 2000 సంవత్సరంలో వెలుగు చూసిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంతో ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తడంతో అతనిపై బిసిసిఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అజారుద్దీన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడంతో 2012లో న్యాయస్థానం అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయినప్పటికీ అజారుద్దీన్‌పై విధించిన నిషేధాన్ని బిసిసిఐ అధికారికంగా తొలగించకపోవడంతో భారత మాజీ క్రికెటర్లకు ఇస్తున్న పెన్షన్ అజారుద్దీన్‌కు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి పార్లమెంట్‌కు ఎన్నికైన అజారుద్దీన్ ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన విషయం విదితమే.