క్రీడాభూమి

రెండో వనే్డపై మంచు ప్రభావం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్, జనవరి 17: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం కటక్‌లో జరిగే రెండో వన్‌డేపై మంచు ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. సాయంత్రం అయిదున్నర గంటలనుంచి మంచు పడడం ప్రారంభమవుతుందని, మ్యాచ్ రోజున కూడా మంచుపడే పక్షంలో అప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా మారవచ్చని స్థానిక క్యూరేటర్ పట్నాయక్ చెప్పాడు. గత కొద్ది రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురిసిందని ఆయన చెప్తూ, రసాయనాల పిచికారీ, రెండు సూపర్ సాపర్ల సాయంతో మంచు ప్రభావాన్ని తొలగించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నాడు. ఔట్‌ఫీల్డ్‌లో ఉన్న పచ్చికను సైతం ఆరు మిల్లీమీటర్ల స్థాయికి కట్ చేయడం జరిగిందని, దీనివల్ల మంచు భూమిలోకి ఇంకిపోతుందని ఆయన తెలిపాడు.
కటక్‌లో వన్‌డే మ్యాచ్ జరిగి రెండేళ్ల పైమాటే అయింది. 2004 నవంబర్ 2న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోరు సాధించి 169 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సారి కూడా భారీ స్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నారా అని అడగ్గా, ఎంత స్కోరు నమోదవుతుందో చెప్పడం కష్టం కానీ, ఈ మైదానంలో ఎప్పటిలాగానే పరుగుల వరద పారడం ఖాయమని పట్నాయక్ చెప్పాడు. ఇదిలా ఉండగా భారత్, ఇంగ్లాండ్ జట్లు బుధవారం ఇక్కడికి చేరుకోనున్నాయి.
కోహ్లీపై ఆయుధంగా షార్ట్‌పిచ్ బాల్స్
ఇదిలా ఉండగా ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అడ్డుకట్టవేయడానికి షార్ట్‌పించ్ బంతులను ఆయుధంగా చేసుకుంటామని ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేక్ బాల్ చెప్తున్నాడు. పుణెలో ఆదివారం ఇంగ్లాండ్‌పై జరిగిన తొలి వన్‌డే మ్యాచ్‌లో కోహ్లీ కేదార్ జాదవ్‌తో కలిసి అయిదో వికెట్‌కు 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని సాధించడంతో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి భారత్ 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. కోహ్లీ ఈ మ్యాచ్‌లో 122 పరుగులు చేయగా, జాదవ్ కూడా 120 పరుగులు చేశాడు. కాగా, కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని టెస్టుల్లో అతడి ఆటను చాలా చూశామని, వన్‌డే సిరీస్‌ను కూడా అతను అదే రీతిలో అద్భుతంగా ప్రారంభించాడని బాల్ బిబిసి రేడియో 5తో మాట్లాడుతూ చెప్పాడు.