క్రీడాభూమి

సెర్బియాలో రాణించిన భారత బాక్సర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: దాదాపు 24 గంటలు విమానాశ్రయంలోనే చిక్కుపడినప్పటికీ, పోటీలలో చాలా భాగం బ్యాగేజి లేకపోయినప్పటికీ సెర్బియాలో జరిగిన నేషనల్ కప్ టోర్నమెంట్‌లో భారతీయ మహిళా బాక్సర్లు మొక్కవోని పట్టుదలను ప్రదర్శించి అరడజను పతకాలను సాధించారు. బలమైన కజకిస్థాన్, రష్యాల తర్వాత మూడో స్థానంలో నిలిచిన పది మంది సభ్యులుండే ఈ బృందం మంగళవారం ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చింది. హర్యానా బాలిక నీరజ్ 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించగా, సర్జుబాల దేవి (48 కిలోలు), ప్రియాంక చౌదరి (60 కిలోలు), పూజ (69 కిలోలు), సీమా పునియా రజత పతకాలు సాధించారు. 75 కిలోల విభాగంలో కవితా గోయట్ కాంస్య పతకం దక్కించుకుంది.
పోటీలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు బృందం సభ్యులు రబస్ చేరుకున్నారు. అయితే దాదాపు 24 గంటలు అష్టకష్టాలు పడి ప్రయాణించిన తర్వాత కానీ వారు అక్కడికి చేరుకోలేక పోయారు. యూరప్‌లో మంచు తుపానుల కారణంగా టర్కీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలన్నీ రద్దు కావడంతో తాము విమానాశ్రయంలోనే చిక్కుపడిపోవలసి వచ్చిందని మహిళల జట్టు కోచ్ గురుబక్స్ సింగ్ చెప్పాడు. ప్రత్యామ్నాయ విమానాన్ని ఫెడరేషన్ ఏర్పాటు చేసింది కానీ, రబస్ చేరుకునే సరికి తమ బ్యాగేజి రాలేదనే విషయం తెలిసిందని ఆయన చెప్పాడు. అయితే అమ్మాయిలంతా తమ శిరస్త్రాణాలు, గమ్ షీల్డ్‌లు మాత్రం తమ చేతి బ్యాగ్‌లలోనే ఉంచుకోవడం అదృష్టమైందని చెప్పాడు. అయితే మెడికల్ బుక్స్ లగేజిలోనే ఉండిపోయాయని, అయినప్పటికీ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా అవి లేకుండానే పోటీల్లో పాల్గొనడానికి నిర్వాహకులు అనుమతించారని గురుబక్స్ సింగ్ చెప్పాడు. విశ్రాంతి తీసుకోవడానికి కానీ, రిలాక్స్ కావడానికి కానీ తమకు టైమ్ లేకపోయిందని, అయినప్పటికీ పోటీల్లో జట్టులోని సభ్యులందరు కూడా చక్కటి ప్రదర్శన ఇచ్చారని ఆయన చెప్పాడు.