క్రీడాభూమి

అశ్విన్ అందరి వాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 18: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఏ ఒక్క ప్రాంతానికో లేదా దేశానికో పరిమితం చేయడం తగదని ప్రముఖ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవ్ వాట్‌మోర్ ప్రశంసించాడు. ఇక్కడి శ్రీరామచంద్ర స్పోర్ట్స్ సైనె్సస్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ, అశ్విన్ అందరి వాడని అన్నాడు. బాల్‌తో అద్భుతాలు సృష్టించే అశ్విన్ బ్యాటింగ్‌లో ఆరో స్థానంలో ఆడినా సెంచరీ చేయగల సమర్థుడని కొనియాడాడు. ముత్తయ్య మురళీధరన్, అశ్విన్ వంటి మేటి ఆటగాళ్లను యావత్ ప్రపంచ ఆస్తిగా పరిగణించాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా తరఫున తొమ్మిది టెస్టులు, ఒక వనే్డ ఇంటర్నేషనల్ ఆడిన వాట్‌మోర్ అన్నాడు. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన అతను ప్రస్తుతం జింబాబ్వే కోచ్‌గా కొనసాగుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శిక్షణనిస్తున్నాడు.