క్రీడాభూమి

హెచ్‌ఐఎల్‌తో తగినంత ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: ఈఏడాది తీరికలేని అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఈనెల 21 నుంచి మొదలయ్యే హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ప్రాక్టీస్ ఈవెంట్‌గా ఉపయోగపడుతుందని భారత డిఫెండర్ బీరేంద్ర లాక్రా అన్నాడు. కండరాలు బెణకడంతో రియో ఒలింపిక్స్‌లో ఆడలేకపోయిన అతను ఆతర్వాత కోలుకొని, నిరుడు అక్టోబర్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగాడు. భారత్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐహెచ్‌ఎల్‌లో రాంచీ రేస్ తరఫున ఆడనున్న తాను అంతర్జాతీయ క్యాలెండర్‌పై దృష్టి పెట్టినట్టు పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లాక్రా తెలిపాడు. ఆసియా చాంపియన్‌షిప్, ఆస్ట్రేలియా పర్యటనలో సాధించిన విజయాలు జట్టులోని ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని అన్నాడు. గాయాలతో బాధపడుతున్నప్పుడు జట్టులోని ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలిచారని అన్నాడు. ఫిజియోథెరపిస్టు, కోచ్‌లు కూడా సహాయసహకారాలు అందించారని చెప్పాడు. అందరి అండదండలతో తాను మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టగలిగానని అన్నాడు. హెచ్‌ఐఎల్ కోసం ఎంతో శ్రమించానని, డిఫెండర్‌గా రాంచీ రేస్‌కు అత్యుత్తమ సేవలు అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నాడు.

నాకు నేనే పోటీ!
మళ్లీ జట్టులోకి వచ్చే సత్తా ఉంది
స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జనవరి 18: తానకు తానే పోటీయని, ఎవరితోనూ పోటీపడాల్సిన అవసరం తనకు లేదని, భారత జాతీయ జట్టులోకి వచ్చే సత్తా తనకు ఉందని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. టీమిండియాలో రెగ్యులర్ స్పిన్నర్‌గా కీలక స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వనే్డలో విఫలమైన విషయం తెలిసిందే. దీనితో భజ్జీకి మళ్లీ జాతీయ జట్టులో స్థానం లభించవచ్చ ఊహాగానాలు మొదలయ్యాయ. యువరాజ్ సింగ్‌కు మళ్లీ జట్టులో చోటు దక్కడం కూడా భజ్జీ ఆశలను పెంచుతున్నది. ఈ వార్తలపై అతను స్పందిస్తూ, తాను ఎవరితోనూ పోటీ పడడం లేదని అతను ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. నిజానికి తనకు తానే పోటీదారుడినని అన్నాడు. ఒకరితో పోల్చడం తనకు ఇష్టం ఉండదని చెప్పాడు. చాలకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఒంటరిగానే ప్రస్థానాన్ని కొనసాగించానని భవిష్యత్తులోనూ అదే విధంగా సాగిపోతానని అన్నాడు. సాధ్యమైనంత వరకూ ఉత్తమ ప్రదర్శనతో రాణించి, మిగతా వారంతా మనతో పోల్చుకునే స్థాయికి చేరడమే లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నట్టు చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, క్రికెట్‌లో రాణించడానికి వయసుకంటే అంకిత భావం అత్యవసరమని 36 ఏళ్ల భజ్జీ వ్యాఖ్యానించాడు. తన వయసే ఉన్న యువీకి జట్టులో చోటు దక్కిందని గుర్తు చేశాడు. అతని ఎంపిక తర్వాత తనలో ధీమా మరింత పెరిగిందని చెప్పాడు. కొంత మంది 45 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా ఆడుతుంటే, తాను ఎందుకు ఆడలేనని ప్రశ్నించాడు. ఆటపై మమకారం ఉందని, అది ఆవిరైనప్పుడు తానే క్రికెట్ నుంచి వైదొలుగుతానని అన్నాడు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. అవరోధాలను అధిగమిస్తేనే లక్ష్యాలు చేరగలుగుతామన్నాడు.