క్రీడాభూమి

చెమటోడ్చిన ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 18: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొని, ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో చెమటోడ్చి నెగ్గాడు. క్వాలిఫయర్ నొవా రూబిన్‌తో తలపడిన అతను 7-5, 6-3, 7-6 ఆధిక్యంతో విజయం సాధించి మూడో రౌండ్ చేరాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో ఆడుతున్న రాఫెల్ నాదల్ 14, నొవాక్ జొకోవిచ్ 12 చొప్పున గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు గెల్చుకున్నారు. వీరు తన రికార్డుకు గట్టిపోటీనిచ్చే అవకాశాలు ఉండడంతో, టైటిళ్ల సంఖ్యను పెంచుకోవడంపై ఫెదరర్ దృష్టి పెట్టాడు. ఈ వెటరన్ ఆటగాడు ఎంత వరకూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తాడో చూడాలి. కాగా, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. రెండో రౌండ్‌లో అతను మరో క్వాలిఫయర్ ఆండ్రీ రుబ్లెవ్‌పై 6-3, 6-0, 6-2 తేడాతో సులభంగా గెలిచాడు. నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా 6-3, 6-4, 6-4 ఆధిక్యంతో స్టీవ్ జాన్సన్‌పై విజయం సాధించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
జెరెమీ చార్డీపై ఐదో సీడ్ కెయ్ నిషికొరీ 6-3, 6-4, 6-3 స్కోరుతో గెలిచాడు. 14వ సీడ్ నిక్ కిర్గియోస్‌పై అన్‌సీడెడ్ ఆటగాడు ఆండ్రియాస్ సెప్పీ 1-6, 6-7, 6-4, 6-2, 10-8 ఆధిక్యంతో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఈ మారథాన్ మ్యాచ్‌లో మొదటి రెండు సెట్లను కోల్పోయినప్పటికీ, ఆతర్వాత వమూడు సెట్లలో గెలిచి మూడో రౌండ్ చేరడం విశేషం.

పారాలింపిక్స్ విజేతలకు
ఎన్‌ఆర్‌ఐ నజరానా
న్యూఢిల్లీ, జనవరి 18: రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త ముక్కట్టు సెబాస్టియన్ నగదు నజరానాలు ప్రకటించాడు. స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్న జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝారియా, హైజంపర్ తంగవేలు మరియప్పన్‌లకు చెరి ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని అందచేస్తున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపాడు. అదే విధంగా రజత పతకాన్ని గెల్చుకున్న షాట్‌పుటర్ దీపా మాలిక్‌కు మూడు లక్షలు, హైజంప్‌లో కాంస్య పతకాన్ని అందుకున్న వరుణ్ సింగ్ భాటికి రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రోత్సాహక బహుమతిని

అభిమానులకు నో ఎంట్రీ!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు మొదటి రోజు మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు, హఠాత్తుగా కొంత మంది అభిమానులను లోనికి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీనితో సెంట్రల్ కోర్టు సమీపంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం ఈ చర్యకు కారణాన్ని అధికారులు వివరించారు. సుమారు 15 నుంచి 20 మంది యువకులు ఆస్ట్రేలియా ఓపెన్‌ను చూసేందుకు వస్తూ, యర్రా నది వద్ద గలభా సృష్టించినట్టు సిసిటీవీ ఫుటేజీల్లో రికార్డయిందని, వారిలో ఇద్దరు గుర్తుతెలియని పదార్ధాలను మండించారని అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఆస్ట్రేలియా ఓపెన్‌లో కీలక మ్యాచ్‌లు జరిగే సెంట్రల్ కోర్టుకు సమీపంలో జరగడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పోలీస్ అధికారులు సిసిటీవీ రికార్డులను పరిశీలిస్తున్నారని తెలిపారు. త్వరలోనే దుండగులను అదుపులోకి తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండో రౌండ్‌కు
సానియా, బార్బరా జోడీ
మెల్బోర్న్: చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా స్ట్రయికొవాతో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో రౌండ్ చేరింది. మొదటి రౌండ్‌లో సానియా, బార్బరా జోడీ 6-3, 6-1 తేడాతో జోసిలిన్ రయే, అన్నా స్మిత్ జోడీపై సునాయాసంగా గెలిచింది. కాగా, పురుషుల డబుల్స్‌లో పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)తో కలిసి ఆడుతున్న రోహన్ బొపన్న కూడా శుభారంభం చేశారు. వీరు మాక్సిమో గంజాలెజ్, తొమాజ్ బెలూసీ జోడీని 6-4, 7-6 తేడాతో ఓడించారు.అందిచేస్తానని తెలిపాడు. ఈనెల 20న తిరువనంతపురంలో జరిగే ఒక కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ నగదు బహుమతులను అంద చేస్తారని వివరించాడు.

ఎండలతో వీనస్ సతమతం
మెల్బోర్న్: మండుతున్న ఎండలు, ఉక్కబోతతో ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ సతమతమవుతున్నది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో మొదటి రౌండ్ మ్యాచ్‌ని ఆడినప్పుడు చెమటతో ముద్దయిపోయిన ఆమె రెండో రౌండ్‌లోనూ అదే సమస్యను ఎదుర్కొంది. తన ప్రత్యర్థి స్ట్ఫోనీ వొగెల్‌ను 6-3, 6-2 తేడాతో ఓడించి, మూడో రౌండ్ చేరినప్పటికీ, చాలా మంది క్రీడాకారులు, ప్రేక్షకుల మాదిరిగానే ఆమె కూడా ఉక్కబోత నుంచి ఉపశమనానికి నానా తంటాలు పడింది.