క్రీడాభూమి

పార్థీవ్ వర్సెస్ సాహా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 19: మొదటిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న గుజరాత్, రెస్ట్ఫా ఇండియా జట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే ఐదు రోజుల ఇరానీ కప్ పోరు ఆ రెండు జట్ల కంటే, వికెట్‌కీపర్లు పార్థీవ్ పటేల్, వృద్ధిమాన్ సాహా మధ్య యుద్ధంగా మారనుంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో, టీమిండియాకు ఎవరు వికెట్‌కీపర్‌గా బాధ్యతలు తీసుకోవడానికి పార్థీవ్, సాహా సిద్ధంగా ఉన్నారు. వెస్టిండీస్ టూర్‌లో అద్భుతంగా రాణించిన సాహా ఆతర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌పైనా చక్కటి ప్రతిభ కనబరిచాడు. అయితే, అతను గాయపడడంతో, పార్థీవ్‌కు జట్టులో అవకాశం వచ్చింది. అతను కూడా తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అంతేగాక, ఇటీవల పటిష్టమైన ముంబయితో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ఒంటి చేత్తో గుజరాత్‌ను గెలిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగులు సాధించి, ముంబయిపై గుజరాత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇటు పార్థీవ్, అటు సాహా ఇద్దరూ కీపర్లుగానేగాక, బ్యాట్స్‌మెన్‌గానూ తమ సత్తా చాటుకున్నారు. దీనితో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు ఎవరిని కీపర్‌గా ఎంపిక చేయాలన్నది సెలక్షన్ కమిటీకి సవాలుగా మారనుంది. ఇదే సమయంలో రంజీ చాంపియన్, రెస్ట్ఫా ఇండియా మధ్య ఇరానీ ట్రోఫీ మ్యాచ్ ప్రారంభం కానున్నందున, పార్థీవ్, సాహా ప్రతిభాపాటవాలను బేరీజు వేసుకునే అవకాశం సెలక్టర్లకు లభిస్తుంది. మొత్తం మీద ఈ మ్యాచ్ ఇద్దరు వికెట్‌కీపర్ల మధ్య యుద్ధంగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది.

చిత్రాలు..పార్థీవ్, సాహా